ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను చుసిన నెటిజన్లు 'రోజు రోజుకి నోటికి హద్దు అనేది లేకుండా పోతుంది నారా లోకేష్' అంటూ నెటిజన్లు మండిపోతున్నారు.   


ప్రశ్నించడం వారి 'హక్కు' అని నచ్చకపోతే గంగలోకి దూకమని ఆంధ్ర రాష్ట్ర 'ముఖ్యమంత్రి వైఎస్ జగన్'పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు నారా లోకేష్. నారా లోకేష్ వారి టీడీపీ నాయకులను జైల్లో పెడుతున్నారని, అసెంబ్లీలో సస్పెండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను చుసిన నెటిజన్లు అందరూ ఘాటుగా స్పందిస్తున్నారు. 


'మీరు ఎవరైనా కావచ్చు, కానీ ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వడం ముందు నేర్చుకోండి. తర్వాత ట్విట్టర్ లో ట్విట్ పెడుదురు' అని కొందరు అంటే మరికొందరు 'మీరు మీడియా ముందు మాట్లాడితేనే మాటలు తప్పుగా మాట్లాడుతారు అనుకున్నాం, కానీ ట్విట్టర్ లో కూడా అదే పని చేస్తారు అని అనుకోలేదు' అంటూ స్పందించారు. మరి కొందరు స్పందిస్తూ 'మిమ్మల్ని ఏమైనా అంటే జైల్లో పెడుతాం అన్నారు, ఇప్పుడు మీరు మా జగన్ అన్నని... మా ముఖ్యమంత్రిని గంగలో దూకమని, మా మనోభావాలు దెబ్బ తీశారు మీ మీద కేసు పెడుతాం' అంటూ ట్విట్ చేశారు.   


  
నెటిజన్లకు ఇన్ని మాటలు అనడానికి కారణం ఈ ట్విట్ ఏ '.@ysjagan గారూ! ఏమిటీ అహంకారం? సభలో మిమ్మల్ని ప్రశ్నించిన బీసీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నారు. బయట మీ పాలనని ప్రశ్నించిన బీసీ నేతలను బెదిరిస్తున్నారు. ప్రశ్నించడం మా బాధ్యత. మేమిలాగే ప్రశ్నిస్తాం. మీకు నచ్చకపోతే వెళ్ళి గంగలో దూకండి. అంతేకానీ బీసీల జోలికి వస్తే ఖబడ్దార్!' అంటూ ట్విట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: