ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ట్విట్టర్ సాక్షిగా నెటిజన్లకు వార్నింగ్ ఇచ్చారు. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారాని, తాను రాసి ట్విట్ చేసినట్టు కొంతమంది నెటిజన్లు ట్విట్ చేసి ఫోటోలను మార్పింగ్ చేస్తున్నారు అని వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్. 


ఆ వార్నింగ్ కూడా రాజకీయంగానే ఇచ్చాడు నారా లోకేష్. వైఎస్ జగన్ మీకు ఇచ్చే పేటీఎం చిల్లర కోసం ఇలాంటి పనులు చేసి జైలుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకోకండి.. జాగ్రత్త అంటూ ట్విట్ చేశారు. నారా లోకేష్ ట్విట్ చేసిన ట్విట్ ఇదే 'మీ జగనన్న విదిల్చే పేటీఎం చిల్లర కోసం మీరు ఎంతటి నీచానికైనా దిగజారతారనడానికి ఇదే నిదర్శనం. నేను అనని మాటలను చేర్చి ఏదో ఘనకార్యం సాధించినట్లు పైశాచికానందం పొందుతున్నారు. మీ అన్న మెప్పుకోసం ఇలాంటి పనులు చేస్తూ పోలీసులకు దొరికితే మాత్రం ఊచలు లెక్కపెడతారు జాగ్రత్త !' అంటూ ట్విట్ చేశారు. 


ఈ ట్విట్ కి సంబందించిన కొన్ని ఫోటోలను పెడుతూ ఈ ట్విట్ అపద్దం, ఈ ట్విట్ నిజం అంటూ ట్విట్ చేసాడు నారా లోకేష్. అయితే నారా లోకేష్ ఈ ట్విట్ చేసి జైలుకు వెళ్తారు జాగ్రత్త అని హెచ్చరించారు కానీ అంతకముందు ఒక గంట క్రితం వైసీపీ అభిమానులు, ఏపీ ప్రజలు మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గంగలో దూకమని ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అయన ఇప్పుడు పెట్టిన ట్విట్ ఆయనకే వర్తిస్తుందని నెటిజన్లు ఘాటు సమాధానం ఇస్తున్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: