రాష్ట్ర విభజనకు ముందు జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఓ మాదిరిగానే నడిచాయి. మూడోసారి చంద్రబాబునాయుడు సిఎం అయిన తర్వాతే  అసెంబ్లీ సమావేశాల నిర్వహణ దిగజారిపోయాయి. అందుకే అసెంబ్లీ సమావేశాలు ఎలా జరపాలో చంద్రబాబే తమకు నేర్పాడని ఇపుడు వైసిపి సభ్యులంటున్నారు. చంద్రబాబు అడుగుజాడల్లోనే తాము కూడా నడుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

 

2014 లో గెలిచిన తర్వాత చంద్రబాబు హయాంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పూర్తిగా ఏకపక్షంగా మారిపోయాయి. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉండటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారు. పైగా ఓ కూటమిగా ఏర్పడి పోరాడినా జగన్ కు 67 సీట్లు రావటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నిరకాలుగా అవమానించాలో అన్ని రకాలుగాను జగన్ అవమానించారు.

 

సభలో అచ్చెన్నాయుడు, దేవినేని, బోండా, బుచ్చయ్య, అనిత, గొల్లపల్లి లాంటి వాళ్ళు జగన్ ను నోటికొచ్చినట్లు తిడుతుంటే చంద్రబాబు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. ఇందుకు నాటి అసెంబ్లీ సమావేశాల వీడియో క్లిప్పింగులే సాక్ష్యం. అప్పట్లో జగన్ ను టిడిపి అవమానించింది కాబట్టి ఇపుడు చంద్రబాబును వైసిపి అవమానించాలని అనుకోవటం సబబు కాదు. అప్పట్లో చంద్రబాబు వైఖరిని జనాలు తప్పటమే కాకుండా జగన్ విషయంలో సానుభూతి కూడా పెంచింది.

 

అదే పద్దతిలో ఇపుడు జగన్ వ్యవహరిస్తే మళ్ళీ చంద్రబాబుపై జనాల్లో జాలి మొదలవుతుంది.  70 ఏళ్ళ వయస్సున్న చంద్రబాబును  కావాలనే అవమానిస్తున్నాడని  జనాలు అనుకుంటే అది జగన్ కే ఇబ్బందిగా మారుతుంది. టిడిపి సభ్యుల సంఖ్యతో పోల్చుకుంటే ఎక్కువ సమయమే మాట్లాడేందుకు స్పీకర్ అవకాశం ఇస్తున్నారు. కాకపోతే గడచిన ఐదేళ్ళల్లో తన వైఫల్యాలను అధికార పార్టీ చూపిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకున్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: