కౌలు రైతులు.. తెలుగు రాష్ట్రాల్లో వీరి బాధలు ఎవరికీ పట్టవు.. ఆరుగాలం శ్రమించినా కౌలు రైతు కుటుంబంలో అందరి నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లే పరిస్థితులు లేవు. వీరి సంక్షేమం కోసం చాలా చేస్తామని గతంలో చాలా చెప్పారు. కానీ ఎవరూ చేసిందేమీ లేదు.


ఇప్పుడు జగన్ మాత్రం మాటలు కట్టిపెట్టి.. చేతల్లో సాయం చూపాడు. భూమి యజమానులకు నష్టం లేకుండా , కౌలు రైతులకు భద్రత కలిగిస్తూ కొత్త చట్టం తెచ్చాడు. ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది.


దీని ప్రకారం.. భూమిపై అన్నిరకాల హక్కులు యజమానికే ఉంటాయి. పంటమీద మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుంది. భూ యజమాని, కౌలుదారులకు ఇద్దరికీ ఈ బిల్లుతో ప్రయోజనం ఉంటుందని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.


ఈ బిల్లు ద్వారా పంటల మీద కౌలు రైతుకు రుణాలు తీసుకోవచ్చు. భూమి మీద రుణం పొందే హక్కు యజమానికి ఉంటుంది. రైతు పెట్టుబడి సాయం ఇద్దరికీ అందుతుంది. రైతు సంస్కరణల్లో ఇది ఓ విప్లవంగా చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: