ఇంగ్లండ్, వేల్స్ వంటి నగరాల్లో ప్రతి ఏడాదీ ప్రతి 100 పెళ్ళిళ్ళకూ 64 డైవోర్స్ కేసులుంటాయట. ఇక్క‌డ దాంప‌త్య‌ జీవితం పెద్ద‌గా సీరియ‌స్‌గా తీసుకునే అంశం కాక‌పోవ‌డంతో ఇలా జ‌రుగుతుంది. ఇదే తాజాగా బ్రిట‌న్ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్ల బోరిస్ విష‌యంలో జ‌రిగింది. బ్రిటన్ కొత్త ప్రధానిగా 55 ఏళ్ళ బోరిస్ జాన్సన్ పదవి చేపట్టగానే.. ఆయన పర్సనల్ లైఫ్ కూడా మెల్లగా బయటికొచ్చి అప్పుడే రచ్ఛ చేయడం ప్రారంభించింది. భార్య, నలుగురు సంతానాన్ని వదిలించుకుని బోరిస్ 31 సంవత్సరాల క్యారీ సైమండ్స్ అనే మరో యువతిని గర్ల్ ఫ్రెండ్ గా చేసుకున్నాడు. ఆ యువతికి తాజాగా ప్ర‌ధాని భార్య హోదా క‌ల్పించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

 

 

సాధారణంగా బ్రిటన్లో నూతన ప్రధాని తన అధికార నివాసానికి చేరుకున్నప్పుడు.. అతని భార్య, లేదా మహిళ అయితే ఆమె భర్త వెంట ఉంటారు. ఈ పోకడ దాదాపు యాభై ఏళ్లుగా కొనసాగుతోంది. కానీ మొదటిసారిగా ఈ ట్రెడిషన్ స్థానే.. కొత్త ‘ ఒరవడి ‘ కి బోరిస్ నాంది పలికారు. ఫస్ట్ టైం ఈయన ఒక్కరే డౌనింగ్ స్ట్రీట్ బ్లాక్ డోర్ వద్ద కనిపించారు.  బోరిస్ తన అధికార నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ బ్లాక్ డోర్ వద్దకు చేరుకోగా.. ఈమె ఆయన స్టాఫ్ కు దగ్గరగా నిలబడి కనిపించింది. క్యారీ సైమండ్స్ బోరిస్ పక్కన కాకుండా.. స్టాఫ్ ముందు కెమెరాలకు కనిపించడం త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌కు సూచనగా భావిస్తున్నారు. బోరిస్ అధికారిక నివాసంలో ఈమె కాలు పెడితే.. 173 ఏళ్లలో ఒక ప్రధాని వయస్సు కన్నా చిన్నదైన అత్యంత పిన్న వయస్కురాలు అవుతుంది.

 

 

 

బోరిస్ కన్సర్వేటివ్ పార్టీకి సంబంధించిన కమ్యూనికేషన్ల మాజీ హెడ్ గా ఆమె వ్యవహరిస్తూ వచ్చింది. గ‌తంలో బోరిస్ ప్రచారం సందర్భంగా ఆయనకు, క్యారీకి మధ్య సాగిన రిలేషన్ షిప్ హెడ్ లైన్లకు చేరింది. సౌత్ లండన్లోని వీరి నివాసంలో వీరి మధ్య ఓ రాత్రి పెద్ద గొడవే జరిగిందట. ఇరుగుపొరుగువారు వీరి అరుపులు, కేకలు విన్నారట. అయితే కొన్ని రోజుల తరువాత వీళ్ళిద్దరూ హ్యాపీగానే కనబడి కెమెరాలకు పోజిచ్చారు.

 

ఇక బోరిస్ వైవాహిక జీవితం విష‌యానికి వ‌స్తే, బోరిస్, ఆయన భార్య మెరీనా వీలర్ (ఈ దంపతులకు నలుగురు సంతానం) గత సెప్టెంబరులో తాము విడిపోతున్నట్టు ప్రకటించారు. 25 ఏళ్ళ తరువాత మేం డైవోర్స్ తీసుకుంటాం అని వాళ్ళు వెల్లడించారు. భార్య, నలుగురు సంతానాన్ని వదిలించుకుని బోరిస్ మరో యువతిని గర్ల్ ఫ్రెండ్ గా చేసుకున్న ఉదంతం ఆ దేశ మీడియాకు ఎంతో మ‌జాను అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: