జగన్ని  బదనాం చేయడానికి చంద్రబాబుకు ఓ ఆయుధం దొరికింది. ఎటూ చేతిలో అనుకూల మీడియా ఉంది. బాబు ఏం చెప్పినా రాస్తున్నారు.  తాను అయిదేళ్ళలో చేసిన పాపాల  వారసత్వం అంతా కలపి జగన్ ఇబ్బందుల్లో ఉంటే వీలైనంతగా జగన్ని విమర్శించాలని, జనంలో పలుచన చేయాలని బాబు రెడీ అయిపోతున్నారు. 


అన్ని వర్గాల జనం ఆందోళనతో ఉన్నారు. ఏపీలో అసలు పాలన లేదు, ఎందుకంటే జగన్ కి ఏమీ అనుభవం లేదు.  ఆయనకు ఏదీ చేతకాదు.  ఇపుడు  చూస్తే  గట్టిగా రెండు నెలలు  కాలేదు జగన్ సీఎం అయి, అంతలోనే బాబు జగన్ గురించి అర్ధం అయిపోయినట్లుగా తనదైన శైలిలో బురదను చల్లేస్తున్నారు.  


ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కనీసం వారం కూడా జగన్ కి చంద్రబాబు సమయం ఇవ్వలేదు. పాలన రంగు రుచి ఏంటో కూడా చూడలేదు. అప్పటి నుంచే విమర్శలతో దాడి చేయడం మొదలెట్టారు బాబు పదే పదే అంటున్న మాట ఒక్కటే, . అమరావతి రాజధాని జగన్ కట్టలేడు, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాదు, ఏపీలో అభివ్రుధ్ధి ఆగిపోయింది. అన్ని వర్గాల జనం ఆందోళనతో ఉన్నారు.


ఏపీలో అసలు పాలన లేదు, ఎందుకంటే జగన్ కి ఏమీ అనుభవం లేదు. ఇదీ బాబు విమర్శల ప్రవాహం. . జగన్ ఇలా పాలన మొదలెట్టారో లేదో బాబు అలా విమర్శలతో  గట్టిగా తగులుకుంటున్నారు.  స్థానిక ఎన్నికలతో  రాజకీయం మొదలుపెట్టి అసలు ఎన్నికల నాటికి తన అనుభవం, జగన్ చేతగానితనం అంటూ పోల్చుతూ జనంలోకి పోవాలన్నది బాబు ఎత్తుగడగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: