వైఎస్ జగన్ ఏపీ సీఎం అయ్యాక.. అమరావతి నిర్మాణం విషయంలో కాస్త స్తబ్దత వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులను సమీక్షించిన తర్వాతే ముందుకు వెళ్లాలని జగన్ సర్కారు భావిస్తోంది. 25 శాతం కంటే తక్కువ పనులు జరిగిన ప్రాజెక్టులను నిలిపేసింది.

ఈ అంశంపై టీడీపీ నేతలు రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను చంపేశారని చంద్రబాబు మండిపడుతున్నారు. అయితే చంద్రబాబు ఆవేదన వెనుక అసలు కథ ఇదీ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్లు పెట్టారు..

అవేమిటంటే..

“ అమరావతి జపాన్‌కు రెండో రాజధాని అవుతుందట. 15 ఓడరేవుల అభివృద్ధికి ఆ దేశం సహకారం అందిస్తుందట. అమరావతి-టోక్యోల మధ్య డైరెక్టు ఫ్లైట్లు. స్కూళ్లలో పిల్లలకు జపనీస్‌ నేర్పిస్తామని అడ్డగోలు కోతలు కోశారు కదా? ఐదేళ్లలో మీరు చెప్పిన పెట్టుబడి ఒక్కటైనా వచ్చిందా చంద్రబాబు గారూ?

అమరావతిని ఖూనీ చేశారు. రియల్ ఎస్టేట్ ధరలు పతనమయ్యాయని చంద్రబాబు గారు గింజుకోవడం వెనక అసలు స్టోరీ ఏమిటంటే? ఇన్ సైడర్‌ ట్రేడింగ్‌తో తన బినామీలు, బంధు గణానికి ముందే ప్లాన్ అందజేశారు. వారి చేతిలో 30 వేల ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు వాళ్లంతా రోడ్డున పడతారని నిద్ర పట్టడం లేదు సారుకి..అంటూ విజయసాయి పోస్టు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: