చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన నీరు-చెట్టు పథకం అవినీతిలో అక్రమార్కులపై రెవిన్యు రికవరీ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జరిగిన అవినీతిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంటు తో విచారణ జరిపించి బాధ్యులను గుర్తిస్తామని అసెంబ్లీ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన ప్రకనట సంచలనంగా మారింది.

 

నీరు-చెట్టు పథకమంటే పోయిన ప్రభుత్వం చాలామంది తెలుగుదేశంపార్టీ నేతలకు కల్పతవురుగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకం అమలులో మొత్తం టిడిపి నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వేల కోట్ల రూపాయలు కుమ్మేశారు. ఉపాధిహామీ, నీరు-చెట్టు పథకం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం రూ. 22, 472 కోట్లు ఖర్చు చేసింది.

 

పై మొత్తం పనులను జన్మభూమి కమిటిల ముసుగులో టిడిపి నేతలే దోచేసుకున్నట్లు బిజెపి నేతలు పదే పదే చేసిన ఆరోపణలు అందరికీ గుర్తుండే ఉంటాయి. బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు లెక్కల ప్రకారమైతే సుమారు రూ. 4 వేల కోట్లు టిడిపి నేతలు దోచేసుకున్నారు. జరిగిన దోపిడిపై అప్పట్లోనే బిజెపి నేతలు కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా చేశారు. నీరు-చెట్టు పథకంలో అక్రమాలంటే మొత్తం టిడిపి నేతలనే అర్ధం.

 

ప్రభుత్వం మారిన తర్వాత తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు దోచుకున్న వారిపై రెవిన్యు రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించటం టిడిపిలో సంచలనంగా మారింది. ప్రతీ జిల్లాలోను ఉపాధి హామీ పథకం పనులనే నీరు-చెట్టు పథకంలో చేసినట్లు చూపించి డబ్బులో దోచేసినట్లు ఆరోపణలున్నాయి. మట్టి పనులనైతే ఒకటికి రెండుసార్లు చేయటం, అసలు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు కాజేశారు. సో ఈ మొత్తం అవినీతిపై రెవిన్యు రికవరీ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయించటం ఎక్కడకు దారి తీస్తుందో చూడాల్సిందే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: