పేరుకు మాత్రమే చంద్రబాబునాయుడు గడచిన 30 ఏళ్ళుగా కుప్పం నియొజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో దాదాపు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. అయినా కుప్పం అభివృద్ధికి చంద్రబాబు చేయాల్సినంత చేయలేదనే చెప్పాలి. అదే జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన 54 రోజుల్లోనే కుప్పాన్ని మున్సిపాలిటిగా చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంటే 30 సంవత్సరాలుగా చంద్రబాబు చేయలేని పనిని జగన్ రెండు మాసాల్లోనే చేసి చూపించారు.

 

తొందరలోనే రాష్ర్టంలో 50 కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రాధమికంగా మున్సిపాలిటీలుగా మార్చటానికి అవకాశం ఉన్న 50 మేజర్ పంచాయితీలను మున్సిపల్ శాఖ గుర్తించింది. వాటిని ఆయా జిల్లాలకు పంపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  జనాభా, మౌళికసదుపాయాలు, ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.

 

మొత్తం 13 జిల్లాల రాష్ట్రంలో గుంటూరు మినహా మిగిలిన 12 జిల్లాల్లో మున్సిపాలిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందులో చిత్తూరు జిల్లాలోని మేజర్ గ్రామపంచాయితి కుప్పం కూడా ఒకటి. నిజానికి కుప్పంను మున్సిపాలిటిగా అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్లు ఎప్పటి నుండో ఉన్నా చంద్రబాబు పట్టించుకోలేదు. గతంలో వచ్చిన డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని జగన్ వెంటనే నిర్ణయం తీసుకున్నారు. ఇపుడున్న 110 మున్సిపాలిటిలకు అదనంగా మరో 50 జత కలవనున్నాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: