ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో నేరస్థులు చాలా తెలివిగా అవతలి వారిని బురిడీ కొట్టిస్తున్నారు.  ఈ నేపథ్యంలో  హయత్‌నగర్‌లో సంచలనం సృష్టించిన కిడ్నాప్‌ కేసులో అనుమానితుడి ఫొటో బయటకు వచ్చింది. ఇప్పటి వరకు హయత్‌నగర్‌లో కిడ్నాప్ కేసులో పోలీసులు నేరస్తుడిని త్వరలో పట్టుకుంటామని చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే...నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లికి చెందిన ఎలిమినేటి యాదయ్య, బొంగుళూర్‌ గేటు వద్ద టీ స్టాల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు.

పెద్ద కుమార్తె పిగ్లీపూర్‌లోని ఎస్‌ఎల్సీ కళాశాలలో బీ ఫార్మసీ చదువుతుండగా, కుమారుడు డేవిడ్‌ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. మంగళ వారం ఉదయం యాదయ్య టీ స్టాల్‌ వద్దకు ఏపి39 ఎక్యూ1686 నంబరు గల కారు వచ్చి ఆగింది.  అందులోంచి దిగిన వ్యక్తి టీస్టాల్ యజమాని యాదయ్యతో తన పేరు శ్రీధర్‌రెడ్డిగా పరిచయం చేసుకున్నాడు. తన తల్లి డాక్టర్‌, తండ్రి జడ్జి అని, సోదరుడు కమిషనర్‌ అని యాదయ్యకు చెప్పాడు. మీ పిల్లలకు బాగా చదువుతున్నారని..భవిష్యత్ లో ఉన్న ఉద్యోగాలు వస్తాయని..మీ పిల్లలకు ఉద్యోగం ఇప్పటించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పాడు.  దాంతో అతని మాయ మాటలు బాగా నమ్మాడు యాదయ్య. కుమార్తె, కొడుకును రాగన్నగూడ లక్ష్మి మెగా సిటీ వెంచర్‌ వద్దకు పిలిపించాడు.

శ్రీధర్‌ రెడ్డి వారు ముగ్గురిని కారులో నగరానికి తీసుకొచ్చాడు. డేవిడ్‌ను బీఎన్‌రెడ్డి నగర్‌ వద్ద దించిన అతను తండ్రీ, కూతురిని నాంపల్లి, అసెంబ్లీ పరిసరాల్లో తిప్పాడు.  ఇలా ఎన్నో రకాల మాయమాటలు చెబుతూ..యాదయ్యకు నమ్మకం కలిగించేలా చేశాడు..వారికి హోటల్ లో భోజనం కూడా పెట్టించాడు. రాత్రి 8 గంటల ప్రాంతంలో హయత్‌నగర్‌ సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం వద్ద సోని పూర్తి వివరాలను తెల్ల కాగితంపై రాసి జిరాక్స్‌ తీసుకురావాలని యాదయ్యను పంపించాడు. అతను కారు దిగి వెళ్లిపోగానే సోనీని తీసుకుని వెళ్లి పోయాడు. 

ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి గురించి ఎంత వెతికినా కనిపించడం లేదని యాదయ్య వాపోయాడు. యాదయ్య ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. కిడ్నాపర్ సెల్‌ఫోన్, కారు నంబర్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు.. ఆరు ప్రత్యేక బృందాలతో అతడి కోసం గాలిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: