ఏపిలో అసెంబ్లీ సెషన్స్ మొదలైనప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాల మద్య ప్రతిరోజూ ఏదో ఒక రగడ జరుగుతూనే ఉంది.  గతంలో టీడీపీ చేసిన లోపాలను ఎత్తి చూపిస్తూ వైసీపీ నేతలు లెక్కలతో సహ వివరిస్తున్నారు. ఇప్పటికే  టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ఈ సమావేశాలు మొత్తానికి సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నందునే వారిని సస్పెండ్ చేశామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ ఎమ్మేల్యేలను అన్యాయంగా సస్పెండ్ చేశారని రక రకాలుగా నిరసనలు తెలుపుతున్నా తెలుగు దేశం సభ్యులు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈరోజు వాకౌట్ చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తమ నాయకుడు చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఏపీ మార్కెటింగ్ బిల్లుతో పాటు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందేముందు కావాలని గొడవపెట్టుకుని టీడీపీ సభ్యులు బయటకు వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే బయటకు వాకౌట్ చేసే ముందు స్పీకర్ తమ్మినేని సీతారాంకు నమస్కారం పెట్టిన చంద్రబాబు బయటకు వచ్చేశారు. కాగా, ప్రతీరోజూ టీడీపీ సభ్యులు ఇదే విషయాన్ని రిపీట్ చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: