మరో నాలుగేళ్ళల్లోనే ఏపిలో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నట్లు తెలుగుదేశంపార్టీ నేతలు బాగానే ఫిక్సయినట్లు కనబడుతోంది.  జగన్మోహన్ రెడ్డి పూర్తికాలం అంటే ఐదేళ్ళు అధికారంలో ఉండరని పార్టీ క్యాడర్ కు బాగా నూరిపోస్తున్నారు. 2023లోనే మళ్ళీ ఎంపి, ఎంఎల్ఏ ఎన్నికలు వచ్చేస్తాయని టిడిపి నేతలు బాగా ప్రచారం చేస్తున్నారు.

 

నాలుగేళ్ళల్లో జరగబోయే జమిలి ఎన్నికల్లో టిడిపినే గెలుస్తుందని బాగా నమ్మకం పెట్టుకున్నారు నేతలు. అదే విషయాన్ని క్యాడర్ బుర్రల్లోకి జొప్పిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఐదేళ్ళ పాలన మళ్ళీ రావాలంటే క్యాడర్ అంతా కలిసి కట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని పిలుపిస్తున్నారు.

 

ఐదేళ్ళలో చంద్రబాబు చేసిన అభివృద్దిని జగన్ రెండు నెలల్లోనే ధ్వంసం చేసేశారట. ఏమి ధ్వంసం చేశారంటే మాత్రం మళ్ళీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండటం లేదు. నిజానికి జగన్ పరిపాలన చంద్రబాబు పాలనకన్నా బాగుందని జనాలు అనుకుంటున్నారు. పాదయాత్రలో కానీండి మ్యానిఫెస్టోలో కానీండి  జగన్ ఇచ్చిన హామీల్లో చాలా వరకూ అమల్లోకి తెచ్చేశారు. కొన్నింటిని టైంబౌండ్ ప్రకారం అమల్లోకి తెస్తున్నారు.

 

సరే ఎలాగూ ఖజానా మొత్తం చంద్రబాబు నాకిపెట్టేశారు కాబట్టి కొన్ని పథకాలకు నిధుల సమస్య రావచ్చు. అంతమాత్రాన రెండు మాసాల్లోనే చంద్రబాబు చేసిన అభివృద్ధిని జగన్ ధ్వంసం చేసిందేమీ లేదు. కాకపోతే చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై సమీక్షలు చేస్తున్నారు. దాంతోనే టిడిపి నేతలు టెన్షన్ పడుతూ జగన్ కు వ్యతిరేకంగా విషప్రచారం మొదలుపెట్టారు. అందులో నుండి వచ్చింది 2023 జమిలి ఎన్నికల ప్రచారం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: