దేశవ్యాప్తంగా ఒక గొప్ప అధ్యయనం జరుగుతోంది, దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో బుల్లెట్ రైలు నెట్‌వర్క్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంచనా వేస్తున్నట్టు  రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ అంగడి శుక్రవారం రాజ్యసభలో తెలిపారు.


ప్రస్తుతం, బుల్లెట్-ట్రైన్ ప్రాజెక్ట్ గా   పిలువబడే ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును 508 కిలోమీటర్ల పొడవుతో కేంద్రం మంజూరు చేసింది. ఇది 2023 లో పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.


ప్రస్తుత ప్రాజెక్టు విజయవంతం అయిన తర్వాత  ఢిల్లీ-కోల్‌కతా, ఢిల్లీ-ముంబై మరియు ఇతర నగరాల్లో ప్రారంభించటానికి కేంద్రం ఆలోచనలో ఉందని ఆయన అన్నారు.

ముంబై- అహ్మదాబాద్ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును 1,08,000 కోట్ల రూపాయల వ్యయంతో  జపాన్ ప్రభుత్వ అనుసంధాన మైన 'నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్' (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్) ద్వారా అమలు చేస్తున్నట్లు మంత్రి తన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  ఈ ప్రాజెక్టు కోసం 2019 జూన్ వరకు సుమారు 3,226.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: