తెలుగుదేశం పార్టీ కుదేలైపోయి ఉంది. ఆ పార్టీకి ఆశ, శ్వాసా అయిన చంద్రబాబే గతంలో ఎన్నడూ లేనంత దిగాలుగా ఉన్నారు. మళ్ళీ అధికారంలోకి రాగలమా అన్న భయం తమ్ముళ్లకు పట్టుకుంది పదేళ్ళ పాటు పోరాటం చేస్తే అయిదేళ్ళ పాటు మాత్రమే  జనం అవకాశం ఇచ్చారని, ఇపుడు మళ్ళీ పదేళ్ళ పాటు పోరాటం చేసే ఓపిక, తీరికా రెండూ లేవని తమ్ముళ్ళు తేల్చేస్తున్నారు.


ఈ పరిస్థితులలో పార్టీకి కొత్త ధైర్యాన్ని ఇచ్చేందుకు చంద్రబాబు రకరకాల ప్లాన్స్  వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తులకు అవకాశం ఉంటుందని కూడా పార్టీ నుంచి ప్రచారం చేయిస్తున్నారు. పవన్ తనకు తాను ఓటమి పాలు అయినా వేరొకరిని గెలిపించే సత్తా కలిగి ఉన్నాడని ఇప్పటికీ చంద్రబాబు నమ్ముతున్నారు.


పవన్ తో పొత్తులు ఉంటే కాపుల ఓట్లతో పాటు,  యూత్ ఓట్లు కూడా గంపగుత్తగా టీడీపీ వైపుగా మళ్ళుతాయన్నది బాబు ఆలోచన. ఈ పొత్తులలో భాగంగా పవన్ జనసేనను జూనియర్ పార్టనర్ గా చేసుకుంటే మరో మారు అధికారం పట్టేయవచ్చు అన్నది బాబు ఎత్తుగడగా ఉంది. పవన్ టీడీపీ పొత్తులంటూ అనుకూల మీడియా అపుడే కధనాలు కూడా వండి వారుస్తోంది.


ఈ నేపధ్యంలో టీడీపీకి షాక్ లాంటి స్టేట్మెంట్ మెగా బ్రదర్ నాగ‌బాబు ఇచ్చేశారు. జనసేనతో టీడీపీ పొత్తు ఉండవచ్చని వార్తలు వచ్చిన నేపద్యంలో ఆ పార్టీ నేత, ప్రముఖ నటుడు నాగబాబు ఎవరితోను పొత్తు ఉండదని లేటెస్ట్ గా ప్రకటించడం విశేషం. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన ఒంటరిగానే పోటీచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని నాగబాబు స్పష్టం చేశారు.


ఇదిలా ఉండగా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, అందుకే బాగా పరిపాలించాలని నాగబాబు అన్నారు.పోలీసులు అధికారంలో ఉన్నవారికి సపోర్టు చేయొచ్చుగానీ, తప్పుడు కేసులు పెట్టకూడదని అన్నారు. కార్యకర్తలలో ఆత్మస్థైర్యం నింపడానికి తాను నరసాపురం వచ్చానని ఆయన తెలిపారు. మొత్తానికి నాగబాబు స్టేట్మెంట్ అంటే అది కచ్చితంగా పవన్ సూచనలతో చేసినదేనని భావిచాలి. సో టీడీపీ ఆశలు ఇప్పటికైతే గల్లంతైనట్లే.
 
 
 
 
 
 
   


మరింత సమాచారం తెలుసుకోండి: