2014లో జనసేన ఆవిర్భవించినా.. పవన్ కళ్యాణ్ ఒక్కరే పార్టీలో ఉన్నారు.  అప్పట్లో కేవలం బయటి నుంచి మాత్రమే సపోర్ట్ చేయడం, పార్టీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురాకపోవడంతో జనసేనలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు.  2019 తరువాత అంతా మారిపోయింది.  


పార్టీలో కార్యకర్తలు ఉన్నారు.  ఒక ఎమ్మెల్యే ఉన్నాడు.  పార్టీలో ముఖ్యనేతలు కూడా ఉన్నారు.  ఇప్పడు పార్టీ చేయాల్సిన పని ఒక్కటే.. పార్టీ ఆశయాలను, ఆలోచనలను ఇంటికింటి తీసుకెళ్లాలి.  ప్రతి గ్రామంలో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఉండాలి.  


గ్రామాలో బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలి.  అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది.  అందుకోసం పవన్ కళ్యాణ్ మొదట పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.  త్వరలోనే ఆదిశగా అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు.  


పార్టీలో కొంతమంది నాయకులకు పార్టీకి సంబంధించిన పనులను అప్పగించారు.  అలానే పవన్ త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ సమస్యల గురించి తెలుసుకోబోతున్నారని వినికిడి.  అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం ఉంది.  త్వరలోనే సంస్థాగత ఎన్నికలు జరగబోతున్నాయి.  ఆ ఎన్నికల్లో తప్పనిసరిగా పవన్ తన ఉనికిని చాటుకోవాలి.  అప్పుడే పార్టీ మనుగడలో ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: