నాగార్జున అక్కినేని వారి వారసుడు. ఏయన్నార్ అరవయ్యేళ్ళ వయసులో నా కళ్ళు చెబుతున్నాయి అంటూ పదాహారేళ్ళ శ్రీదేవి వెంటపడితే జనం విరగబడి చూశారు. ఏకంగా 500 రోజులు ప్రేమాభిషేకం  సినిమాను ఆడించేశారు. మరి నాటి పరిస్థితి ఇపుడు ఉందా. అదే అరవయ్యేళ్ళ వయసులో నాగార్జున రకుల్ తో మన్మధుడు 2 లో  ప్రేమ‌ గీతాలు పాడుతూంటే సోషల్ మీడియా యుగంలో జనం  వూరుకుంటారా..


సరిగ్గా ఇదే జరుగుతోంది. నాగ్ మీద పంచ్ లు పడుతున్నాయి. ఒకటి రెండు కాదు వరసగా పేలుతున్నాయి. ఈ సంగతి అందరి కంటే ముందే తెలిసిన హీరో కాబట్టే నాగార్జున తన మన్మధుడు 2 మూవీలో తన మీద తానే పంచ్ లు వేసుకుంటాడు. అంతేనా పక్కన స్నేహితుడిగా ఉన్న వెన్నల కిషోర్ తోనూ వేయించుకుంటాడు.


నీవింకా అప్పటి  మన్మధుడు అనుకుంటున్నావా అంటూ వెన్నెల కిషోర్ నాగ్ మీద సెటైర్లు వేయడం ద్వారా మూవీలో నాగ్ బ్యాలన్స్ మెయింటైన్ చేశాడన్న మాట. అంతేనా రావు రమేష్ క్యారక్టర్ సైతం రకుల్ తో నాగ్ లో ఏముందని ప్రేమిస్తున్నావు అంటుంది. ఇలా నాగ్ ఏజ్ బార్ విషయమే మన్మధుడులో ఫుల్ ఫన్నీ గా మారుతోందన్నమాట.


ఎటువంటి ఇగోలకూ పోకుండా నాగ్ తన మీద సెటైర్లు, పంచ్ డైలాగులు వేయించుకోవడం బట్టి చూస్తే న్యూ జనరేషన్ పల్స్ బాగానే పసిగట్టేశాడనిపిస్తోంది. జనాల్లో ఉన్న దాన్ని తామే అనేసుకుంటే ఆ సీరియస్ నెస్ పోయి ఫన్ జనరేట్ అవుతుంది. 


అది కొత్తగా సినిమాకు ప్లస్ కూడా అవుతుంది. ఈ ఐడియాతోనే నాగ్ దగ్గరుండి తన వయసు  మీద డైలాగులు ఎక్కువగా రాయించాడనుకోవాలి. మొత్తానికి నాగ్ మీద పడ్డ పంచులే ఇపుడు మన్మధుడు 2 మూవీకి పెద్ద అసెట్ అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: