నార్త్ లో చాల రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది.  సాధ్యం కాదని అనుకున్న ఈశాన్యరాష్ట్రాల్లో కూడా అడుగుపెట్టింది.  అక్కడ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది.  పశ్చిమ బెంగాల్ లో కూడా బీజేపీ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.  వచ్చే ఏడాది ఆ రాష్ట్రానికి జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తోంది.  అందుకోసం ఇప్పటి నుంచే పావులు కడుపుతున్నది బీజేపీ.  ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో 18 స్థానాలు కైవసం చేసుకొని మమతా పార్టీకి ఇరకాటంలో పెట్టింది.  


ఇప్పుడు బీజేపీ దృష్టి దక్షిణాది రాష్ట్రాలపై పడింది.  ఒక్క కర్ణాటకలో మినహా ఆ పార్టీకి మిగతా చోట్ల పెద్దగా సీట్లు లేవు.  తెలంగాణాలో కాస్తోకూస్తో పరిస్థితి మెరుగ్గా ఉన్నది.  అక్కడ నాలుగు పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది.  ఆ పార్టీకి ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నారు.  వచ్చే ఎన్నికల నాటికి ఒక్కరితో మొదలు పెట్టి వంద స్థానాలు గెలుపే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడం మొదలుపెట్టింది.  


ఇందులో భాగంగానే మొదటిసారి పార్లమెంట్ కు ఎంపికైన కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవిని ఇచ్చింది.  కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణాలో చురుగ్గా పావులు కదుపుతున్నారు. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణాపై దృష్టి పెట్టారు.  అందుకే ఇక్కడ సభ్యత్వం తీసుకోవాలని అనుకుంటున్నారు.  


ఆగస్ట్ 15 నుంచి 17 వ తేదీల మధ్యలో అమిత్ షా హైదరాబాద్ కు రానున్నారు.  వచ్చిన తరువాత హైదరాబాద్ లో అయన యాక్టివ్ మెంబెర్ గా సభ్యత్వం తీసుకోబోతున్నారు.  అంతేకాకుండా, స్పెషల్ డ్రైవ్ కింద 15 లక్షలమంది సభ్యులను కొత్తగా పార్టీలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.  కార్యకర్తలు ప్రధాన బలం కాబట్టి యాక్టివ్ గా ఉండే వ్యక్తుల కోసం బీజీపీ అన్వేషణ మొదలు పెట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: