పార్టీలో ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుండి బోండా ఉమ పార్టీ యాక్టివిటీస్ లో పెద్దగా పాల్గొనటం లేదు. చంద్రబాబునాయుడుతో కానీ లోకేష్ తో కానీ లేకపోతే జిల్లాలోని ముఖ్య నేతలతో కూడా టచ్ లో ఉండటం లేదు. దాంతో అందరికీ బోండా పార్టీ మారుతారనే ప్రచారం పెరిగిపోతోంది.

ఈ ప్రచారానికి మరింత ఊపునిచ్చే ఘటన కూడా జరగటంతో అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి.  బోండా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం. బోండా ఆస్ట్రేలియాలోనే ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆస్ట్రేలియాలోని టిడిపి అభిమానులు మీట్ అండ్ గ్రీట్ అనే కార్యక్రమం పెట్టాలని అనుకున్నారట. అక్కడే మాట్లాడుదామని ప్రయత్నించినా సాధ్యం కాలేదని తెలిసింది. అందుకే విజయవాడ పార్టీ కార్యాలయం ద్వారా ప్రయత్నించారు.


వెంటనే బోండాతో కాంటాక్టు చేయాలని ప్రయత్నించారట. అయితే వాళ్ళెవరితో కలవటానికి ఉమ ఏమాత్రం ఆసక్తి చూపటం లేదని సమాచారం. ఈ మధ్యనే పర్చూరు ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టిడిపి అభిమానులతో ఉత్సాహంగా కలిశారు.  ఏలూరితో సమావేం అయిన తర్వాత టిడిపి ఎన్ఆర్ఏ విభాగంలో కూడా కాస్త ఉత్సాహం మొదలైందని చెప్పుకుంటున్నారు

 

టిడిపి అభిమానులతో ఏలూరి కలిసినపుడు బోండాకు మాత్రం ఏమొచ్చిందనే ప్రశ్న మొదలైంది. దాంతో కుదిరితే వైసిపిలోకి లేకపోతే బిజెపిలోకి వెళ్ళిపోయేందుకు బోండా ప్రయత్నాలు చేసుకుంటారనే ప్రచారం నేపధ్యంలోనే ఆస్ట్రేలియాలో టిడిపి అభిమానులకు దూరంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఆస్ట్రేలియా నుండి తిరిగి రాగానే  బోండా టిడిపికి రాజీనామా చేస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆమధ్య కాకినాడ లో కాపు నేతలతో సమావేశం పెట్టారని ప్రచారం జరుగుతోంది. కాబట్టి బోండా తిరిగి వస్తేనే విషయం ఏమిటో తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: