ఏపీలో జగన్ అఖండ విజయాన్ని నమోదు చేసిన తరువాత వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలని ప్లాన్ వేస్తుంది. దానికనుగుణంగానే ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తుంది. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రుణం ఇచ్చేందుకు ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్ ను వెనక్కి తగ్గేలా చేయటంలో కేంద్రం కీలకభూమిక పోషించిన వైనం బయటకు రావటం తెలిసిందే. తనకే మాత్రం ఇష్టం లేని ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించటంపైనా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే తమ వ్యూహంలో భాగంగా బాబును ప్రతిపక్ష పాత్రలో ఉండేలా చేసిన కమలనాథులు.. ఈ మధ్యనే టీడీపీకి చెందిన పలువురు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు.టీడీపీకి చెందిన పలువురు నేతల్ని బీజేపీలోకి తేవటం ద్వారా ఏపీలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేయాలన్నది ప్లాన్ గా చెబుతున్నారు. ఇలా చేయటం ద్వారా తనకు పెరిగి బలంతో ఎదగాలన్నది కమలనాథుల ఆలోచనగా చెబుతున్నారు.తొలుత బాబుకు చెక్ పెట్టటంలో విజయం సాధించిన బీజేపీ నేతలు ఇప్పుడు జగన్ మీద దృష్టి పెట్టారు.ఆయన పాలనపై ఇప్పుడే విమర్శల్ని సంధించటం ద్వారా జగన్ పాలనలో ఏదో జరిగిపోతుందన్న భావన కలిగేలా మైండ్ గేమ్ ను మొదలెట్టారు.


ఏపీలో చంద్రబాబు ఓడిపోయి జగన్ గెలవటం వల్ల ఏపీ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని రాంమాధవ్ లాంటి నేత వ్యాఖ్యానించటం ఒక ఎత్తు అయితే.. జగన్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినట్లుగా దగ్గుబాటి పురంధేశ్వరి విమర్శల్ని చూస్తే.. జగన్ పై అదే పనిగా డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేయాలన్నది బీజేపీ ప్లాన్ గా భావిస్తున్నారు. ఓవైపు కేంద్రం నుంచి సాయాన్ని బంద్ చేసి.. మరోవైపు ఏపీ సర్కారుపై విమర్శల్ని సంధించటం ద్వారా.. ప్రజల్లో బీజేపీపై చూపు పడేలా చేయటంతో పాటు.. బలమైన నాయకులు తమ పార్టీలో చేరేలా ప్లానింగ్ చేసినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: