ఆ మద్య  ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ చేసిన సంచలన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగింది.  కరీంనగర్‌లో ఓ వర్గం ప్రజలను మరో వర్గం వారిపై దాడికి ఉసిగొల్పేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌కు ఊరట లభించింది.  ఆ ప్రసంగంలో ఎలాంటి తప్పులేదని అన్నారు. ఆయన ప్రసంగంలో ఉద్దేశపూరి వ్యాఖ్యలు లేవని సీపీ ప్రకటించారు అక్బరుద్దీన్ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని  న్యాయనిపుణులు తేల్చిచెప్పారు.   అక్బరుద్దీన్ ప్రసంగానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. 


ఈ సమావేశంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వర్గాన్ని అవమానించే విధంగా,  విద్వేషపూరితంగా, రెచ్చగొట్టేవిధంగా  ప్రసంగించారని గత మూడు రోజులుగా ఫేస్బుక్,ట్విట్టర్,వాట్సాప్  మొదలైన  సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీనిపై బిజెపి జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ  ఫిర్యాదు చేశారు. పోలీస్ శాఖ ముందుజాగ్రత్త చర్యగా అక్బరుద్దీన్ ప్రసంగాన్ని వీడియో రికార్డు చేశారు. ఆ మేరకు చేసిన ఫిర్యాదుపై సత్వరమే స్పందించిన పోలీసు శాఖ అట్టి ప్రసంగం వీడియోను Translation Expert(అనువాద నిపుణుల) సహాయంతో ట్రాన్సులేషన్ చేయించి, వీడియో రికార్డింగ్‌ను, అనువాద ప్రతిని న్యాయనిపుణుల సలహా కోసం పంపించారు. 


వీడియో ప్రసంగంలోని ప్రతి పదాన్ని,వ్యాఖ్యలను క్షుణ్ణంగా పరిశీలించి అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగంలో ఎటువంటి విద్వేషపూరిత వాఖ్యలు గాని,రెచ్చగొట్టే విధంగా ఉండే వాఖ్యలు లేవని మరియు ఈ ప్రసంగం మీద ఎలాంటి కేసులు నమోదు చేసేందుకు అవకాశం లేదని  నిపుణులు సలహా ఇచ్చారు. న్యాయనిపుణుల సలహా మేరకు ఈ ప్రసంగం పైన తదుపరి చర్యలకు అవకాశం లేదు కాబట్టి కేసు నమోదు చేయడం లేదని తెలిపారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించి శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో పోలీసులకు సహకారం అందించాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: