చంద్రబాబునాయుడు పాలనా దక్షత ఏమిటో ఎల్లో మీడియానే చాటి చెప్పింది. అనంతపురంలో కియా కార్ల తయారీ సంస్ధను తానే తెచ్చానని గొప్పగా చెప్పుకుంటున్న చంద్రబాబు సంస్ధ చేసే మోసాల విషయంలో మాత్రం నోరు మెదపటం లేదు. చివరకు చంద్రబాబు అధికారంలో నుండి దిగిపోయిన తర్వాత కానీ జరిగిన మోసం బయటపడలేదు.

 

ఇంతకీ ఏం జరిగిందంటే జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం దగ్గర్లో కియా కార్ల ఉత్పత్తి ప్లాంటు పెట్టారు. అప్పట్లోనే ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా స్ధానికులకు 11 వేల మందికి ఉద్యోగవకాశాలు కల్పించనున్నట్లు సంస్ధ యాజమాన్యం సంతకాలు కూడా చేసింది.  తమకు ఉద్యోగవకాశాలు వస్తాయన్న ఆశతోనే స్ధానికులు కూడా తమ వ్యవసాయ భూములను ప్రభుత్వానికి అప్పగించారు.

 

సీన్ కట్ చేస్తే జరిగిందేమిటంటే, కియా యాజమాన్యం ప్లాంటును కట్టి ఉత్పత్తి ప్రారంభించింది. కానీ స్ధానికులకు మాత్రం చెప్పినట్లుగా ఉద్యోగాలివ్వలేదు. 11 వేల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన యాజమాన్యం కేవలం 620 మందిని మాత్రం ఉద్యోగం లోకి తీసుకుంది.  ఉత్పత్తి ప్లాంటులోని ఏ విభాగంలో చూసినా తమిళనాడు వాళ్ళే కనబడుతున్నారు. అదేమిటని అడిగినా సమాధానం చెప్పటం లేదు ఎవరూ.

 

కార్ల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతోనే ఐటిఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ చదవిన విద్యార్ధులు ఆటోమొబైల్ రంగంలో అవసరమైన శిక్షణ కూడా తీసుకున్నారట. మరికొందరైతే ఏకంగా కొరియన్ భాష కూడా  నేర్చుకుంటున్నారట. అయినా సరే వేలాదిమందికి ఉద్యోగాలు రావటం లేదు. మరి ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు కూడా ఆ విషయాన్ని గాలికొదిలేశారు.

 

ఇటు యాజమాన్యం ఉద్యోగాల్లోకి తీసుకోక, అటు చంద్రబాబూ పట్టించుకోకపోవటం స్ధానికులు మండిపోయారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో జనాలు టిడిపికి గట్టిగా బుద్ధి చెప్పారు. చంద్రబాబు ఓడిపోవటానికి ఇటువంటి కారణాలు అనేకమున్నా ఆయనకు మాత్రం పార్టీ ఓడిపోవటానికి కారణాలు తెలియటం లేదట.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: