జేసీ బ్రదర్స్ ఈ పేరు వెనుక ఉన్న చరిత్ర అయిదేళ్లు కాదు పదేళ్లు కాదు నలభై ఐదు సంవత్సరాల హిస్టరీ ఉంది నలభై ఐదేళ్లుగా తాడిపత్రి కేంద్రం గా అనంతపురం లో నిర్మించిన రాజకీయ సామ్రాజ్యం ఉంది ఇప్పుడదంతా కేవలం ఒకే ఒక ఎన్నికల్లో ఓటమితో కుప్ప కూలుతోంది. 2019 ఎన్నికలకు ముందే జేసీ బ్రదర్స్ ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పేశారు. కానీ వారసులను ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపారు జేసీ పవన్, జేసీ అశ్మిత్ ఇద్దరూ ఎన్నికల్లో ఓటిమిపాలయ్యారు దానితో ఒక్క సారిగా జేసీ బ్రదర్స్ సైలెంటైపోయారు.వైసిపి మీద ఒంటి కాలిపై లేచే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి  పూర్తిగా సైలెంట్ అయిపోయారు.


అంతేకాదు జేసీ దివాకర్ రెడ్డి అయితే జగన్ మావాడే అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.  అటు పార్టీ ఓటమి పాలై ఇటు తమ వారసుల ఓడిపోవడంతో మౌనం వహించక తప్పలేదు జేసీ బ్రదర్స్ కి. కానీ గత కొన్ని రోజులు గా ఒక్కసారి గా సీన్ మారింది జేసీ బ్రదర్స్ వాయిస్ పెంచారు, సవాళ్లు విసురుతున్నారు. అటు చూస్తే టిడిపి ఇంకా ఓటమి  షాక్ నుంచి తేరుకోలేదు, ఎవరు ఎప్పుడు సైకిల్ దిగుతారో అర్థం కాని పరిస్థితి.


ఇటు చూస్తే తాడిపత్రి లో ఏమాత్రం ఛాన్స్ ఇచ్చేది లేదని కేతిరెడ్డి తేల్చిచెప్పేసారు, ఇలా మొత్తం ప్రతికూల వాతావరణం ఉన్నా  జేసీ బ్రదర్స్ మళ్లీ వైసీపీ ని ఎలా టార్గెట్ చేస్తున్నారు వీరి దూకుడు వెనుక ఉన్న శక్తి ఏంటి అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. దివాకరెడ్డి కొంత మౌనంగా ఉన్న ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రి అంత పర్యటిస్తూ వైసిపి మీద విమర్శలు చేస్తున్నారు. జేసీ బ్రదర్స్ దూకుడు పెంచటానికి అసలు కారణం బీజేపీనే అన్న చర్చ టిడిపిలో ను సాగుతోందట.


ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే జేసీ బ్రదర్స్ కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చర్చ సాగింది అయితే  ఆ ప్రచారాన్ని జేసీ బ్రదర్స్ ఖండించారు.అయితే ఇప్పుడు బీజేపీ తో మంతనాలు కూడా ముగిశాయని పూర్తి భరోసా లభించిన తర్వాతే వైసీపీ ని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేలుస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు.


అటు జేసీ పవన్ మాత్రం బిజెపి లోకి వెళ్లేది లేదని చెబుతున్నారు, అంతా ప్రచారమే అని ఖండిస్తున్నారు కానీ వైసీపీ ఏం చేయగలదు మహా అయితే జైల్లో పెడతారు అంతేకదా అనేదాకా ప్రభాకరెడ్డి వెళ్లడం వెనుక మాత్రం బలమైన పొలిటికల్ పవర్ ఉందని అది బిజెపినే అన్న గుసగుసలు టిడిపి లో వినిపిస్తున్నాయట. జేసీ బ్రదర్స్ దూకుడు వెనక అసలు కారణం ఏంటన్నది అతి త్వరలోనే తేలిపోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: