కేసీఆర్ సర్కారులో ఐఏఎస్ అధికారుల పట్ల వివక్ష ఉందా.. కొన్ని సామాజిక వర్గాలకు చెందిన ఐఏఎస్‌లకు ప్రాధాన్యం లేని పోస్టులు అంటగడుతున్నారా.. కొన్ని వర్గాల వారికి అగ్రప్రాధాన్యం ఇస్తున్నారా.. అవునంటున్నారు ఆకునూరి మురళీ అనే ఐఏఎస్ అధికారి.


ఎస్సి, బిసి,ఎస్టి అధికారుల పట్ల కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. కేవలం ఆరోపించడమే కాదు.. అందుకు నిరసనగా ఆయన ఏకంగా పదవికి రాజీనామా చేశారు. మరో 10 నెలల సర్వీస్ ఉండగానే ఆయన విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు.


మరి కేసీఆర్ హయాంలో నిజంగానే ఎస్సీ, బీసీ, ఎస్టీ అధికారుల పట్ల వివక్ష ఉందా.. ఈ అంశంపై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. కొందరు ఐఏఎస్‌లు ప్రత్యేకంగా సమావేశమై తమ పట్ల వివక్ష చూపుతున్నారని బాధపడ్డారు కూడా.


ఇక ఆకునూరి మురళీ ఇటీవలి కాలం వరకూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా ఉండేవారు. ఆయన్ను అక్కడి నుంచి అంతగా ప్రాధాన్యత లేని పురావాస్తు శాఖ సంచాలకులుగా బదిలీ చేసింది. దీంతో ఆయన హర్ట్ అయ్యారు.


పురావస్తు శాఖ సంచాలకులు గా ఉన్న మురళీ.. తన 38 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ లేనంత ఖాళీగా ఉన్నానని అంటున్నారు. అందుకే రాజీనామా చేస్తున్నానని మురళి చెబుతున్నారు. ఇటీవల ఓ ఐపీఎస్ అధికారి కూడా ఇలాగే కామెంట్ చేశారు. పని లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందన్నారు.కొందరు పని లేదని ఐపీఎస్, ఐ ఏఎస్ లు బాధపడుతున్నారు. మరోవైపు సర్కారు అధికారుల కొరత ఉందని అంటోంది. మరోవైపు వివక్ష అంటున్నారు.. ఈ మొత్తం వ్యవస్థ ప్రక్షాళన చేసేదెవరో..?


మరింత సమాచారం తెలుసుకోండి: