అందంగా కనిపించేవన్ని నిజంగా అందంగా ఉండవు.  అందంగా కనబడనివి అందంగా లేనట్టుకాడు. కొన్నిసార్లు ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా కనిపిస్తుంటాయి.  దాన్నే కనికట్టు అంటుంటారు.  స్పెయిన్ లోని ఓ  సరస్సు ఇలాంటి కణికట్టునే చేస్తున్నది. స్పెయిన్ లోని గాలిసియా ప్రాంతంలో మాంటె నెమి అనే చోట ఓ సరస్సు ఉన్నది.  ఈ సరస్సును చూడగానే ప్రతి ఒక్కరు ఎట్రాక్ట్ అవుతారు.  


ఇలా ఎట్రాక్ట్ కావడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి.  ఈ సరస్సులోని నీరు నీలిరంగులో ఉంటుంది. సాధారణంగా నీళ్లకు రంగు ఉండదు.  రంగు ఉన్నది ఉంటె అందులో తేడా ఉన్నట్టే. కానీ కంటికి ఆకర్షించే గుణం కలిగిన రంగులో ఆ నీళ్లు కనిపిస్తుంటాయి.  కాబట్టి ఎట్రాక్ట్ కాకుండా ఎలా ఉంటారు చెప్పండి.  అందుకే చూడగానే ఆ సరస్సులో దిగి స్నానం చేయాలని అనిపిస్తుంది.  


అలా ఎట్రాక్ట్ అయ్యి సరస్సులోకి దిగారో.. ఇక అంతే.. శరీరానికి లేనిపోని రోగాలు అంటుకుంటాయి.  చర్మవ్యాధులు వస్తాయట.  కొన్నిసార్లు అలర్జీల వలన వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఈ సరస్సును చూసేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది టూరిస్టులు స్పెయిన్ వస్తుంటారు.  అసలు ఈ సరస్సు లోని నీటికి ఆ రంగు ఎలా వచ్చింది.. తెలుసుకుందాం.  


గాలిసియాకు దగ్గరిలో టంగ్ స్టెన్ అనే గని ఉన్నది.  అక్కడి వ్యర్ధపదార్ధాలను గాలిసియా సరస్సు దగ్గరకి తీసుకొచ్చి డంప్ చేస్తారు.  ఆ వ్యర్ధపదార్ధాల్లోని రసాయనాల కారణంగా నీరు కలుషితమయ్యి నీలిరంగుగా మారిపోయింది.  దీన్ని గాలిసియన్‌ చెర్నోబిల్‌గా పిలుస్తుంటారు. అయితే దీని గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. దీంతో చాలా మంది దీన్ని సరస్సు అనే అనుకుంటున్నారు.  ఈ సరస్సులోకి దిగి టూరిస్టులు ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారనే విషయం తెలిసి అక్కడి ప్రభుత్వం ఆ సరస్సుకు దగ్గర్లో హెచ్చరికతో కూడిన బోర్డులను ఏర్పాటు చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: