కమెడియన్ పృథ్వీకి వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎస్వీబీసీ చానెల్ కు చైర్మన్ గా బాద్యత గల పదవిని అప్పగించింది. ఎన్నికల్లో జగన్ కు సపోర్ట్ గా నిలవడమే కాకుండా మెగా హీరోలను టార్గెట్ చేసి తిట్టడంతో జగన్ కు నమ్మకస్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను కార్నర్ చేయడం బాగా కలిసొచ్చి ఈ పదవి రావడానికి పరోక్షంగా లాభించిందనేది వాస్తవం.

 

పృథ్వీ టాలెంట్ చూసే జగన్ ప్రభుత్వం ఈ బాధ్యత అప్పగించిందనేది అమాయకత్వమే అవుతుంది. తాజాగా ఓ టాప్ రేటెడ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో ”జగన్ సీఎం కావడం ఇండస్ట్రీలో కొందరికి ఇష్టం లేదు.. నాకు సినిమాల్లో వేషాలివ్వకుండా కొందరు అడ్డుకుంటున్నారు” అంటూ ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నాడు. తాను ఇప్పుడు ఓ భక్తి చానెల్ కి చైర్మన్ అనే విషయం మరచిపోతున్నాడు. తన బాధ్యత.. భక్తి చానెల్ పవిత్రతకు భంగం కలగకుండా చూసుకోవడం, భక్తుల కోసం మరిన్ని మెరుగైన కార్యక్రమాలు రూపొందించే పనిలో ఉండటం. ఇదంతా వదిలేసి రాజకీయాలు మాట్లాడటం పృథ్వీ  ప్రస్తుత హోదాకు తగదు. ఇక్కడ జగన్ గురించి పృథ్వీ ప్రత్యేకంగా ఏం చెప్పక్కరలేదు. జగన్ సీఎం కాబట్టి ఆటోమేటిక్ ఫోకస్ ఉంటుంది.

 

పవిత్రమైన పదవి వచ్చాక రాజకీయపరమైన అభిప్రాయాలకు తావులేదు. మునుపు చైర్మన్ గా పని చేసిన సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఏనాడు రాజకీయాలు మాట్లాడలేదు. టీడీపీని గానీ చంద్రబాబును కానీ పబ్లిక్ గా వెనుకేసుకొచ్చింది లేదు. ఆయన పనేదో ఆయన చేసుకున్నాడు. ప్రస్తుత టీటీడీ చైర్మన్, జగన్ బంధువు అయిన వై.వీ.సుబ్బారెడ్డి రాజకీయాలు మాట్లాడకుండా ఆ పదవికి తగ్గట్టే పని చేసుకుపోతూండటం పృథ్వీ గమనించాలి. లేకుంటే.. ఏ ప్రజలైతే ఒకరికి బుద్ధి చెప్పారో అదే ప్రజలు మరొకరికి బుద్ది చెప్పరా ఏంటి!

మరింత సమాచారం తెలుసుకోండి: