వైసీపీ అధికారంలోకి రావడంతోనే ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెడుతోంది తెలుగుదేశం పార్టీ.  చంద్రబాబును పాలనాదక్షునిగా, అభివ్రుధ్ధి వీరుడిగా అనుకూల మీడియా చిత్రీకరిస్తోంది. అదే సమయంలో బాబు చేసిన మంచి పనులను వైసీపీ సర్కార్ పక్కకు పెడుతోందని కూడా హాట్ కామెంట్స్ చేస్తోంది. నిజానికి జగన్ అధికారం చేపట్టి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. కనీసం ఆరు నెలలు హానీమూన్  టైం ఇస్తామన్న టీడీపీ యూ టర్న్ తీసుకుంటే ఆ పార్టీకి మద్దతుగా ఉన్న ఎల్లో మీడియా పూనకం వచ్చినట్లుగా జగన్ మీద విరుఛుకుపడిపోతోంది.


ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా ఇపుడు తన ప్రభుత్వంపైన వచ్చిన ఆరోపణలను జగన్ గట్టిగా తిప్పికొట్టాలనుకుంటున్నారు. అందుకోసం ఆయన మాస్టర్ ప్లాన్ వేశారు. ఆగస్ట్ 9న విజయవాడ వేదికగా అతి పెద్ద ఇండస్త్రియల్ సమ్మిట్ ని జగన్ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించబోతోంది. ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యం రాష్ట్రంలో పెట్టుబడులను పెద్ద ఎత్తున తీసుకురావడమే. ఈ భారీ ఇండస్ట్రియల్ సమ్మిట్ కి ప్రపంచం నలుమూలల నుంచి ముప్పయి నుంచి నలభై దేశాలకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారని ప్రభుత్వ వర్గాల సమాచారం. రెండు భాగాలుగా జరిగే ఈ పారిశ్రామిక సదస్సులో జగన్ పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.


అదే విధంగా రెండవ భాగంలో ఆయన ఒక్కొ దేశం నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలను విడివిడిగా కలుస్తారు. వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. అదే విధంగా వారికి వైసీపీ సర్కార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న పధకాల గురించి తెలియచేస్తారు. ఏపీలో పారిశ్రామిక వాతావరణం ఎలా అనుకూలంగా ఉందో గట్టిగా చెబుతారు. అనేక రాయితీలను తమ ప్రభుత్వం ఎలా కల్పిస్తుందో కూడా విడమరచి వివరిస్తారు.ఇదిలా ఉండగా ఈ ఏడాది లోపే ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలన్న గట్టి సంకల్పతో జగన్ సర్కార్ ఉందిట. ఇందుకోసం తొలి ప్రయత్నంలోనే నలభై దేశాలకు ఆహ్వానం  పంపారు. అందులో కనీసం 50 శాతమైనా గ్రౌడింగ్ అయితే ఏపీలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని కూడా జగన్ భావిస్తున్నారు.


ఇప్పటికే ప్రభుత్వ రంగం ద్వారా 4.1 లక్షల జాబ్స్ ని ఇస్తున్న జగన్ ప్రభుత్వం రానున్న రోజుల్లో ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధిని పెంచాలనుకుంటోంది. అందుకోసం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు అంటూ ప్రత్యేక చట్టం కూడా తీసుకువచ్చింది. ఈ విధంగా కనుక పెట్టుబడులు ఏపీకి వచ్చినట్లైతే నిరుద్యోగం ఏపీలో ఉండదన్నది జగన్ ఆలోచన. ఆ దిశగా తొలి పారిశ్రామిక సదస్సు ఘన విజయం సాధించడానికి ఇప్పటి నుంచే డిజైన్ చేస్తోంది  వైసీపీ ప్రభుత్వం. ఈ విధానం ద్వారా ఎన్ని పెట్టుబడులు నికరంగా వచ్చాయన్నది కూడా తెలియచేసి టీడీపీ అర్బాటపు ప్రచారానికి శాశ్వతంగా తెర వేయాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: