మెగస్టార్ రీ ఎంట్రీ మూవీ ఖైదీ 150 లో ఓ మాస్ నంబర్ ఉంది. రత్తాలు రత్తాలు అంటూ సాగే ఆ సాంగ్ లో మెగాస్టార్ తో జోడీ కట్టిన రాయ్ లక్ష్మి యూత్ కి పూనకమే తెప్పించింది. చిరుతో సరి సాటిగా చిందులు వేయడమే కాదు తనలోని సరుకంతా చూపించి యూత్ గుండెలను అడ్డంగా నరికేసింది. రత్తాలూ అంటూ ఇప్పటికీ ఆ బ్రాండ్ ఇమేజ్ రాయ్ లక్ష్మి సొంతం. ఆమె ఐటం బాంబ్ కాదు కానీ అంతకు మించి అన్నట్లుగా ఆ సాంగ్ ప్రూవ్ చేసింది.


ఇక ఫస్ట్ మూవీ శ్రీకాంత్ తో చేసింది. కాంచనమాలా కేబుల్  టీవీ మూవీలో కొత్త అందాలాతో రాయ్ లక్ష్మి టాలీవుడ్ ని అప్పట్లో  పలకరించింది. ఆ మూవి  యావరేజ్ అయినా కూడా ఆమెకు అవకాశాలు లేవు. అన్ని భాషల్లో కలుపుకుని ఇప్పటికి యాభై మూవీస్ చేసిన రాయ్ లక్ష్మి వయసు 32 ఏళ్ళు. 2005లో ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ అమ్మడు ఇప్పటికీ నాటౌట్ అంటోంది. అందాల జిగి, బిగి ఎక్కడా తగ్గకుండా కాపాడుకుంటోంది.


ఇదిలా ఉండగా రాయ్ లక్ష్మికి సరైన విజ‌యం రుచి తెలియదు. ఆమె ఎన్నో మూవీస్ చేసినా కూడా బ్రేక్ రాలేదు. బాలయ్యతో 2012లో చేసిన అధినాయకుడు మూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ మూవీలోనే మన రత్తాలు అందాన్నంతా అలా ఆరబోసేసింది. ఓ బాత్ రూం సాంగ్ లో బాలయ్యతో కలసి యమ షో చేసేసింది.  ఆ మూవీ కనుక హిట్ అయి ఉంటే రత్తాలు స్టారే తిరిగిపోయేది. కానీ ఆమెకు ఆఫర్లు ఎక్కడా రాలేదు. అప్పట్లో


ఇక‌ తనకు వెండి తెర కంటే ఇన్స్టాగ్రాం లోనే గ్లామర్ షో చేయడం ఇష్టమని రాయ్ లక్ష్మి చెప్పకనే చెబుతోంది. అందుకే ఆమె సొగసు సెగలన్నీ అక్కడే కనిపిస్తున్నాయి. రాయ్ లక్ష్మి కి ఇపుదు రెండు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మరింతగా వారు పెరిగిపోతున్నారు. అదే సమయంలో వారి టెంపరేచర్లు కూడా పెంచేలా రాయ్ లక్ష్మి చేస్తున్న స్కిన్ షో అదిరిపోతోంది. లేటెస్ట్ గా స్విం సూట్ లో రాయ్ లక్ష్మి ఇచ్చిన కిక్కుకు కుర్ర కారు తెగ గింజుకుంటోందట. మొత్తానికి ఆమె పేరు రాయ్ లక్ష్మి కానీ ఆమె పిక్స్ చూసిన వారు మాత్రం నోట మాట రాక రాయిలా మారిపోతున్నరంటే అంతకంటే గొప్ప కాంప్లిమెంట్ ఉంటుందా.



మరింత సమాచారం తెలుసుకోండి: