ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ట్విట్టర్ వేధికగా వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ గారు! మీ పాలనాదౌర్భాగ్యం రాష్ట్రాన్ని ఎలా పట్టి పీడిస్తోందో చూడండి' అంటూ వీడియోని జత చేసి ట్విట్ చేశారు. ఈ ట్విట్ చుసిన నెటిజన్లకు భారీ కోపం తెప్పించారు. 


నిన్నంత ట్విట్ల మీద ట్విట్లు చేస్తూ వైసీపీ నాయకులను విమర్శిస్తున్నారు. 'రేషన్ డీలర్ షిప్ ఇవ్వాలని ఏకంగా తహసీల్దార్ నే బెదిరించారు మీ పార్టీ నేతలు, అది తప్పని చెప్పినందుకు ఒక ముస్లిం మహిళా అధికారిణిని అసభ్య పదజాలంతో దూషించి, ఆమెపై దాడిచేయబోయాడు' అంటూ ట్విట్ చేసారు నారా లోకేష్. ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు హిందువులకు, ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నావా అంటూ మండిపడ్డారు. 


ఈ ట్విట్ పై ట్రోల్స్ జరుగుతున్నప్పటికీ మరో ట్విట్ తో నారా లోకేష్ ముందుకు వచ్చారు. 'పొనుగుపాడులో టీడీపీ నిజనిర్ధారణ కమిటీని ఊళ్ళోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గం. టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా వైసీపీ నేతలు గోడ కట్టినప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు మా పార్టీవాళ్ళను కలవనిస్తే మీ దౌర్జన్యాలు బయటపడతాయని భయమా?' అంటూ ప్రశ్నిస్తున్నారు నారాలోకేష్. 


ఈ ట్విట్ కి స్పందించిన నెటిజన్లు కొంతమంది నారా లోకేష్ కి వత్తాసు పలుకుతే మరికొందరు నెటిజన్లు నారా లోకేష్ పై మండిపడుతున్నారు. ఇంకా ఆపండి మీ సోది అని కొందరు అంటే.. మరి కొందరు మరో ఆరు నెలల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని చూడండి ఎంతటి అభివృద్ధి అవుతుందో చుడండి అంటూ మరికొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: