వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎద్దేవా చేశారు . వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు...అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలంనెట్టుకొస్తున్నారని ధ్వజమెత్తారు.  ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్  ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారని మండిపడ్డారు.


తండ్రి అధికారాన్ని,శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిదయితే , తండ్రి ముఖ్యమంత్రి గా ఉన్నా ఏ రోజు అటు వైపు కూడా చూడకుండా స్వచ్ఛమైన మనస్సు,నీతి,నిజాయితితో ఎదిగింది మా మావయ్య బాలయ్య చరిత్ర అంటూ చెప్పుకొచ్చారు . అటువంటి వ్యక్తి రాజధాని లో భూములు కొన్నారని ఆరోపణలు చేయడం కాదు ...దమ్ముంటే నిరూపించండి,  లేక రాజధాని రైతులకు,రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండంటూ లోకేష్ సవాల్ విసిరిరారు . ఒక ఆంగ్ల దినపత్రిక లో సినీ నటుడు , తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆయన బంధువులు 500 ఎకరాల భూములు కొనుగోలు చేశారంటూ రాసిన కథనం కాపీ జత చేస్తూ , ట్విట్టర్ వేదిక లోకేష్, వైకాపా నాయకులపై విరుచుకుపడ్డారు .


అమరావతిని రాజధానిగా ప్రకటించకముందే బాలయ్య ఆయన బంధువులు భూములను కొనుగోలు చేశారని వైకాపా నాయకులు ఆరోపించినట్లు సదరు ఆంగ్ల దినపత్రిక తన కథనం లో పేర్కొంది . దీనితో లోకేష్ వైకాపా నేతలపై విరుచుకుపడుతూ తండ్రి అధికారాన్ని , శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిదంటూ దెప్పి పొడిచారు .ఆంధ్ర ప్రదేశ్ ప్రజల కలల రాజధాని అమరావతిని దెబ్బతీయడానికి ఇన్ సేడ్ ట్రేడింగ్ జరిగిందని బురద చల్లుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు . వైకాపా నేతలు మొదటి నుంచి అమరావతి పరిసరాల్లో టీడీపీ నేతలు , వారి బంధువులు , అనుయాయులు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపిస్తున్నారు . తమ పార్టీ నేతలకు లబ్ది చేకూర్చడానికి అమరావతిని చంద్రబాబు సర్కార్ రాజధాని నగరంగా ప్రకటించిందని విమర్శిస్తున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: