టీడీపీ పార్టీ తన స్థాపన నుంచి 2019 ఎన్నికల నాటి ఘోర పరాజయాన్ని ఇంత వరకు చవిచూడలేదన్నది నగ్న సత్యం. టీడీపీ పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితం అవ్వటం చివరికి ఆ పార్టీ అధినేతనే ఆశ్చర్యపరిచిందంటే అతిశయెక్తి కాదు. ఆ పార్టీలోని కీలక నేతలు కూడా పార్టీని వీడి తమ దారిని తాము చూసుకున్న పరిస్థితి. అయితే టీడీపీ పార్టీ క్షేత్ర స్థాయి నుంచి ఘోరంగా దెబ్బతిందని ఇప్పటికే పలువురు విశ్లేషకులు చెప్పడం గమనార్హం. పార్టీ మీద ఎంతో వ్యతిరేకత ఉంటే గాని ఇలాంటి ఫలితాలు రావని టీడీపీలోని కొంత మంది నేతలు బహిరంగంగా చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము. 


తాజాగా ఏపీలో టీడీపీ పరిస్థితి చూస్తుంటే.. ఆ పార్టీ పని అయిపోయినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా బీజేపీ సీనియర్ నేత..గతంలో వాజ్ పేయ్ ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా వ్యవహరించిన రెబల్ స్టార్ కృష్ణం రాజు ఈ మధ్యన బీజేపీ వ్యవహారాల్లో కాస్త యాక్టివ్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హాజరయ్యేందుకు భీమవరం వచ్చిన ఆయన.. బాబు పైనా.. ఆయన పార్టీ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


చిన్నపామును కూడా పెద్ద కర్రతో కొట్టాలంటారని.. పాము చచ్చిపోయిన తర్వాత ఇక కర్ర ఎందుకు? అంటూ చంద్రబాబు తాజా పరిస్థితి ఎంతలా ఉందన్న విషయాన్ని తన మాటలతో చెప్పేశారు. ఏపీ విపక్ష పార్టీని ఉద్దేశించి.. చచ్చినపాముతో పోల్చిన కృష్ణంరాజు వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తనను కేంద్రం జైల్లో పెడుతుందేమోనని బాబు భయాన్ని వ్యక్తం చేస్తున్నారని.. తప్పు చేసినోళ్లకు శిక్ష తప్పదని చెప్పారు. ప్రజల్లో సింపతీ కోసమే బాబు కావాలని భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తుంటారని చెప్పిన రెబల్ స్టార్.. తెలుగు ప్రజలందరికి న్యాయం జరగాలని తాను కోరుకుంటానని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: