కేశినేని ట్రావెల్స్ అధినేత‌, విజ‌య‌వాడ టిడిపి ఎంపి కేశినేనికి కొత్త క‌ష్టాలు వ‌చ్చాయి.. కాదు.. కాదు.. తెచ్చారు.. నిన్నటి దాకా ట్విట్టర్ వేదిక‌గా అంద‌రినీ ఎడాపెడా వాయించేసిన కేశినేని నాని ఇపుడు సైలెంట్ అయిపోయారు. కాస్త జోరు తగ్గించారు.


విజయ‌వాడ వైసిపి ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన పివిపి కి కేశినేని కి ఈమ‌ధ్య ట్విట్టర్ వార్ హోరాహోరీగా జ‌రుగుతోంది. కేశినేని ట్రావెల్స్‌లో జరుగుతున్న గొడవ ఈ వార్ కు ఆజ్యం పోసింది. కేశినేని ట్రావెల్స్ లో ప‌నిచేసిన ఉద్యోగులు త‌మకు జీతాలు సెటిల్ చేయ‌లేదంటూ రోడ్డుకెక్కారు. టెంట్ వేసారు.


ఇదే అదను అనుకుని పివిపి కేశినేనికి కౌంట‌ర్ వేయ‌డం ఆరంభించారు.. ``కేశినేనీ... వెధ‌వ ట్వీట్‌లు చేయ‌కుండా... సొల్లు చెప్పకుండా రోడ్డుపైకి రా.. బాధితుల‌తో మాట్లాడు సెటిల్‌మెంట్ చేయి.. ఉద్యోగుల పొట్టకొడితే పుట్టగ‌తులుండ‌వ్‌..వందలాది మంది ఉద్యోగుల పొట్ట కొట్టి వీరంతా వంద‌ల కోట్లు సంపాదించార‌ు..ఈవిష‌యాన్ని జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ‌తా.. వారికి న్యాయం జ‌రిగేదాకా ఊరుకోను `` అంటూ పివిపి డిమాండ్ చేసారు.


ఇందుకు కేశినేని నాని స్పంద‌న కూడా కాస్త ఘాటుగానే ఉంది మరి. `` నేను ఎవ‌రికీ బ‌కాయిలు లేను... రెండు వేల మంది ఉద్యోగుల‌కు గాను 14 మంది లేబ‌రు కోర్టును ఆశ్రయించారు.. అది న్యాయ‌ ప‌రంగా ఏ నిర్ణయం వ‌చ్చినా దానికి బాధ్యత వ‌హిస్తాను... ఇపుడు ఎవ‌రైనా సాక్ష్యాల‌తో బ‌కాయిలు ఉన్నట్టు నిరూపిస్తే వెంట‌నే సెటిల్ చేస్తాను..పైగా ఎవ‌రి ట్వీట్ ల‌కు నేను స‌మాధానం చెప్పవ‌ల‌సిన అవ‌సరం లేదు...`` అని చెప్పకుండానే చెప్పేశారు కేశినేని నాని. మరి ఈ కథ.. ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: