చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు వెళ్ళేముందే కడప జిల్లాలో టిడిపి నేత పెద్ద షాకే ఇచ్చారు. కమలాపురం మాజీ ఎంఎల్ఏ వీరశివారెడ్డి తెలుగుదేశంపార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబు నాయకత్వం మీద నమ్మకం లేకే, టిడిపికి భవిష్యత్తు లేదన్న నమ్మకంతోనే రాజీనామా చేసినట్లు మాజీ ఎంఎల్ఏ స్పష్టంగా ప్రకటించటం గమనార్హం.

 

మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు విదేశీ ప్రయాణానికి వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. చంద్రబాబు అలా విమానం ఎక్కారో లేదో పార్టీలోని రాజ్యసభ ఎంపిల్లో నలుగురు బిజెపిలోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. సరే చంద్రబాబే వాళ్ళని బిజెపిలోకి పంపారని ప్రచారం కూడా జరిగింది.

 

భవిష్యత్తులో వైసిపి, నరేంద్రమోడి నుండి తనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చంద్రబాబే ముందు జాగ్రత్తగా తన అవసరాల కోసం సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ లు చంద్రబాబుకు బాగా సన్నిహితులు కూడా కావటంతోనే ప్రచారానికి ఊతమొచ్చింది. ఇంకా చాలామంది ఎంఎల్ఏలు, మాజీ ఎంఎల్ఏలు టిడిపిని వదిలేయటానికి రెడీగా ఉన్నారనే ప్రచారం రోజు రోజుకు పెరుగుతోంది.

 

ఈ నేపధ్యంలోనే చంద్రబాబు అమెరికా పర్యటనకు బయలుదేరారు. మాజీ సిఎం అలా బయలుదేరే ముందు వీరశివారెడ్డి టిడిపికి రాజీనామా చేయటం గమనార్హం. తొందరలోనే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరనున్నట్లు చెప్పారు. చూడబోతే శివారెడ్డితో పాటు చాలామంది నేతలు రెడీగా ఉన్నారు బయటకు వచ్చేయటానికి.

 

అదే సమయంలో అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే కొందరు ఎంఎల్ఏలు ఇంకా టిడిపిలో కంటిన్యు అవుతున్నారు. లేకపోతే ఏరోజో బిజెపిలో చేరిపోయేవాళ్ళే. ఆషాఢమాసం వెళ్ళిపోగానే 16 మంది ఎంఎల్ఏలు తమ పార్టీలో చేరనున్నట్లు బిజెపి నేతలు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే అనర్హత వేటు నుండి తప్పించుకునేందుకు వాళ్ళేమైనా మార్గం కనిపెట్టారా ? చూడాలి ఏం జరుగుతుందో ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: