2014,2019 ఎన్నికల్లో కేంద్రంలో రెండు సార్లు అధికారం సాధించింది బీజేపీ పార్టీ. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా ప్రజలపై ఈ పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ఈ పార్టీలు కూడా ఎన్నికల్లో ఒకటీ రెండు శాతం కంటే ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకోవటంలో విఫలమవుతున్నాయి. 
 
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే సాధించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడింది కాబట్టి బీజేపీ తెలుగుదేశం స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. బీజేపీ బలపడటం కోసం అన్ని పార్టీల నుండి కార్యకర్తల్ని, మాజీ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి చేర్చుకుంటుంది. టీడీపీకి చెందిన ఆరుగురు రాజ్యసభ ఎంపీలలో నలుగురు రాజ్యసభ ఎంపీలను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుండి బీజేపీలోకి చేర్చుకుంది. 
 
కానీ ఇతర పార్టీల నుండి నాయకుల్ని చేర్చుకోవడం ద్వారా పెద్దగా ఫలితం ఉండదనే విషయం బీజేపీ గుర్తుంచుకోవాలి. 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ విజయం సాధించింది. అయినప్పటికీ ప్రతిపక్షమైన వైసీపీ పార్టీని బలహీనపరచటానికి వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుంది. 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినా వైసీపీ పార్టీ ఏ మాత్రం బలహీనపడకపోగా 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 సీట్లతో ఘన విజయం సాధించింది. 
 
బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలంటే ప్రత్యేక హోదా, పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు, విభజన హామీల్ని నెరవేర్చటం, రాష్ట్ర అభివృధ్ధికి సహకరించటం వలన ప్రజల్లో బీజేపీ పార్టీకి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృధ్ధి విషయంలో నిర్లక్ష్యం చూపి ఎంతమంది నాయకుల్ని చేర్చుకున్నా ఫలితం మాత్రం ఉండదు. మరి బీజేపీ పార్టీ ఈ దిశగా ఆలోచిస్తుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: