ఒకప్పుడు భూమిపై అతిపెద్ద జీవులు ఉండేవి.  అవి కేవలం తమను తాము కాపాడుకోవడనికి, ఆహారాన్ని అన్వేషించుకోవడానికి మాత్రమే ప్రయత్నించాయి కానీ, ప్రకృతిని పాడుచేయలేదు.  వినాశనాన్ని కోరుకోలేదు.  ఇంకా చెప్పాలి అంటే వాటికి అంతటి తెలివి లేదు.  తమ ఆహరం, తమ భద్రత మాత్రమే ముఖ్యం అనుకున్నాయి.  కాలక్రమేణా ప్రకృతిలో జరిగిన పరిణామాల కారణంగా అంతరించిపోయాయి.  


ఈ పరిణామ క్రమంలో మనిషి పుట్టుక జరిగింది.  మనిషికి మిగతా జీవులకంటే తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టి తెలివైన జీవిగా బ్రతకడం మొదలుపెట్టారు.  ప్రకృతిలోని ప్రతి వస్తువును వాడుకోవడం మొదలు పెట్టారు.  కోట్ల సంవత్సరాల నుంచి భూమిలో నిక్షిప్తమైన సహజవాయువులను బయటకు తీసి వాడుకుంటున్నాడు.  భూమిలోనుంచి సహజవాయువులను తోడేస్తుండంతో.. క్రమంగా వాటి లభ్యత తగ్గిపోతున్నది. 


పైగా వాతావరణంలో కర్బన పదార్దాల పరిమితి పెరిగిపోతున్నది.  గత కొంతకాలంగా ఇది మరింతగా పెరిగింది.  దీంతో వాతావరణంలో అసహజమైన మార్పులు వస్తున్నాయి.  ఎప్పుడు లేనంతగా వర్షాలు కురవడం.. చల్లదనం ఎక్కువగా ఉండే యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయి.  ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం వలన అక్కడి పరిస్థితులు మారిపోతున్నాయి.  


ఇప్పుడు మరోసమస్య మనిషి ముందుకు వచ్చింది.  మనిషి మనుగడలో ఉండాలి అంటే కర్బన పదార్దాలు గాలిలో 350 పిపిఎంకు మించకూడదు. కానీ, ఇప్పటివరకు ఎప్పడు లేనంతగా అది 415 పిపిఎం కు పెరిగింది.  దీంతో పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు.  భూమిమీద అసహజమైన మార్పులు జరగడానికి ఇదొక కారణం అని చెప్తున్నారు.   

ఈ పరిస్థితి ఇలాగే కొన్నాళ్ళు కొనసాగితే.. భూమిపై మనిషి మనుగడ ప్రశ్నర్ధకంగా మారుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ముందు వాతావరణంలో కర్బన పదార్ధాల శాతాన్ని తగ్గించాలని దానికోసం ప్రపంచంలోని అన్ని దేశాలు కృషి చేయాలని పర్యావరణ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: