అధికార టీఆర్ ఎస్ పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు తారా స్థాయికి చేరుతున్నాయి. ఆయా జిల్లాల్లో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పో రుతో క్యాడ‌ర్ గంద‌ర‌గోళానికి గురవువుతోంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టుకోసం నాయ‌కులు ఎవ‌రికి వారు గట్టి ప్ర‌య‌త్నాలు చే సుకుంటుండ‌టంతో కిందిస్థాయి నేత‌లు, కార్య‌క‌ర్త‌లు రెండు శిబిరాలుగా విడిపోయారు. కొత్త‌గా పార్టీలో చేరిన నేత‌ల‌తో సీనియ‌ర్ల‌కు పొస‌గ‌డం లేదు. రాజ‌కీయంగా త‌మ ఆధిప‌త్యాన్ని చాటుకునేందుకు సీనియర్ నేత‌లు  తీవ్రంగా శ్రమిస్తుంటే, సీనియ‌ర్ల‌కు చెక్ పెట్టేందుకు జూనియ‌ర్లు పావులు క‌దుపుతున్నారు. 


ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రాష్ట్ర మంత్రి, సీనియ‌ర్ నేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుకు, మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి కి మ‌ధ్య  కోల్డ్‌వార్ న‌డుస్తోంది. వాస్త‌వానికి టీడీపీలో  ఉన్న‌ప్ప‌టి నుంచే ఈ ఇద్ద‌రు నేత‌ల  మ‌ధ్య ఆధిప‌త్య పోరు ఉండేది. తర్వాత టీఆర్ ఎస్‌లో చేరిన‌ప్ప‌టికీ ఇరువురి మ‌ధ్య అంత‌రం త‌గ్గ‌లేదు. గ‌త ప్ర‌భుత్వంలో ఉప ముఖ్య‌మంత్రిగా ఓ వెలు గు వెలిగిన క‌డియం శ్రీహ‌రి ప్ర‌భ రానురాను త‌గ్గుతోంది. ఈసారి మంత్రివ‌ర్గంలో ఆయ‌న‌కు చోటుద‌క్క‌లేదు. మ‌రో ప‌క్క ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావుకు మంత్రి ప‌ద‌వి ల‌భించ‌డంతో క‌డియం హ‌వాకు చెక్ ప‌డింది. 


ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన తర్వాత‌ జిల్లాలో ఆయ‌న‌కు ఎదురే లేకుండాపోయింది. ప్ర‌భుత్వ  కార్య‌క్ర‌మాల‌తోపాటు పార్టీ వ్య‌వ‌హారాల్లో  అన్నీతానే వ్యవహరిస్తూ,  జిల్లాలో చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో క‌డియం శ్రీహ‌రి ప్రాధాన్యం క్ర‌మంగా త‌గ్గుతుండ‌టంతో ఎర్ర‌బెల్లి పెత్త‌నాన్ని క‌డియం వ‌ర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు.  ఇక ఖ‌మ్మం జిల్లాలోనూ నేత‌లు ఎవ‌రికివారుగా వ్య‌హరిస్తున్నారు. సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావుకు, కందాల ఉపేంద‌ర్ రెడ్డికి మ‌ధ్య రాజ‌కీయ వైరం కొన‌సాగుంతోంది. 


2018 అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజ‌క‌వ‌ర్గం టీఆర్ ఎస్ నుంచి పోటీ చేసిన తుమ్మ‌ల‌పై కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థి కందాల ఉపేంద‌ర్ రెడ్డి విజ‌యంసాధించారు. అనంత‌రం ఉపేంద‌ర్‌రెడ్డి టీఆర్ ఎస్‌లో చేరారు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి నేత‌ల మ‌ధ్య కోల్డ్‌వార్ న‌డుస్తోంది. ఇక కేసీఆర్ సొంత జిల్లా మెద‌క్‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. మాజీ డిప్యూటీ స్పీక‌ర్, మెద‌క్ ఎమ్మెల్యే ప‌ద్మా దేవేంద ర్‌రెడ్డికి, అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డికి మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతోంది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య వైరంతో క్యాడ‌ర్ అయోమ‌యానికి గుర‌వుతున్నారు. రాష్ట్రంలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీలో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఈ గొడ‌వ‌ల నేప‌థ్యంలో కేసీఆర్ సైతం కాస్త ఆందోళ‌న‌లోనే ఉన్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం పాల‌న‌పై దృష్టిపెట్టిన ఆయ‌న పార్టీ వ్య‌వ‌హారాల‌ను ప‌ట్టించుకునే తీరిక లేక‌పోవ‌డంతోనే వీరు పేట్రేగిపోతున్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: