బందరు పోర్టును తెలంగాణాకు రాసిచ్చేసేందుకు రంగం సిద్ధమైందా ? అలాగని  చంద్రబాబునాయుడు ఆరోపిస్తున్నారు.  ఆరోగ్య పరీక్షల నిమ్మితం అమెరికాకు వెళ్ళిన చంద్రబాబు ఆ పనిమీద ఉండకుండా బందరు పోర్టు గోల ఆయనకెందుకు ? ట్విట్టర్లో స్పందిస్తు బందరు పోర్టును తెలంగాణాకు అప్పగించేందుకు తెరవెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయని మండిపడుతున్నారు.

 

అందుకు ఆయనకున్న ఆధారమేమిటయ్యా అంటే మచిలీపట్నం పోర్టు విషయంలో ప్రభుత్వం ఓ జీవోను జారీ చేసి రెండు రోజులకే ఉపసంహరించుకుందట. కాబట్టి ఆ రహస్య జీవో బందరు పోర్టుదే అంటూ ట్విట్టర్లో ఆరోపించేశారు.  పోర్టులు సీమాధ్రకు ప్రకృతి ప్రసాదించిందని చంద్రబాబు తాజాగా చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

ప్రకృతి ప్రసాదించిన పోర్టులపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తెలంగాణాకు అప్పగించేయాలని ప్రభుత్వం అనుకుంటే ఊరుకునేది లేదని కూడా గట్టి వార్నింగ్ ఇచ్చేశారు. పైగా పోర్టులపై సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఎవరికీ లేదని కూడా చెప్పటం విడ్డూరంగా ఉంది.

 

మొన్నటి వరకూ అధికారంలో ఉన్నపుడు తాను చేసిందేమిటో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే బాగుటుంది. రాజధానిగా అమరావతిని నిర్ణయించినపుడు, స్విస్ ఛాలెంజ్ పద్దతిలో సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నపుడు ముందుగా జనాలకు చెప్పారా ? రాజకీయపార్టీలతో మాట్లాడారా ? ప్రత్యేకహోదా వద్దని చెప్పేముందు జనాలతో కానీ అఖిలపక్ష సమావేశం కానీ నిర్వహించే నిర్ణయం తీసుకున్నారా ? ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి చంద్రబాబు నిర్వాకాలు.

 

అయినా బందరు పోర్టును ఉపయోగించుకునేందుకు తెలంగాణాకు అవకాశం ఇస్తే తప్పేంటి ? దాని ద్వారా ఏపికి అదాయం వస్తుంది కదా ? బందరు పోర్టును తెలంగాణాకు రాసిచ్చేసేదేమీ ఉండదు కదా ?  జగన్ ప్రభుత్వం  తీసుకునే ఏ నిర్ణయాన్నైనా అడ్డుకునే శక్తి తనకు లేదని చంద్రబాబుకు బాగా తెలుసు. . అసలు  ఈ పోర్టును వాడుకునే సౌకర్యం తెలంగాణాకు ఇచ్చే ప్రక్రియ చంద్రబాబు హయాంలోనే మొదలైందట. వాస్తవాలు ఇలా వుండగా ఎందుకీ బెదిరింపులు ?


 


మరింత సమాచారం తెలుసుకోండి: