గోదావరి జలాలను కృష్ణ పరీవాహకానికి తరలించేందుకు అనువైన మార్గాల అన్వేషణ కొనసాగుతోంది. ఇందు కోసం ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రుల సమక్షంలో ఇప్పటికే చర్చలు జరిగాయ్. గోదావరి, శ్రీశైలాన్ని కలిపే మార్గాలపై అధికారుల లెవల్లో చర్చలు జరుగుతున్నాయి. మెరుగైన ప్రతిపాదనలు తీసుకురావలన్న సీఎం సూచన మేరకు సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతోంది. శ్రీశైలంపై నీటి తరలింపు ద్వారా ఏపీ లోని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంతో పాటు తెలంగాణలో పాత మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీరు అందించాలనేది సంకల్పం.గోదావరి, శ్రీశైలం అనుసంధానంపై ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదనలకు తోడు మరిన్ని అనువైన ప్రాంతాలను గుర్తించేందుకు ఇంజినీర్లూ కసరత్తు చేపట్టారు. గోదావరి నుంచి ప్రతి ఏటా మూడు వేల నుంచి నాలుగు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి.


గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి, శబరిజరుగు తోంది శ్రీశైలానికి నాలుగు టీఎంసీ లను తరలించేందు కు సాధ్యాసాధ్యా లు మార్గాలపై గూగుల్ మ్యాప్ ట్రోపో నదులు కలిసే చోట ప్రవాహం ఉధృతంగా ఉంటుంది.   డెబ్బై ఐదు శాతం నీటి లభ్యత ఆధారం గా తెలుగు రాష్ట్రాల పరిధి లో 3,516 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని నిపుణులు అంచనా. ఈ నీటిని కృష్ణా బేసిన్ కు తరలించాలని రెండు రాష్ట్రాల సీఎంలు ఆలోచిస్తున్నారు.గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించే ప్రణాళికలపై రీసెర్చ్ వర్క్ జరుగుతోంది శ్రీశైలానికి నాలుగు టీఎంసీలను తరలించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలు మార్గాలపై 'గూగుల్ మ్యాప్', 'ట్రోపో మ్యాప్' ఆధారంగా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకూ తెరపైకొచ్చిన ప్రతిపాదనలకు తోడు కొత్త కొత్త ప్రతిపాదనలు కూడా అన్వేషిస్తున్నారు. గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఎక్కడుంది, ఖర్చు ఎక్కడ తక్కువవుతుంది.? అటవీ భూముల సమస్య రాకుండా ఎలా తరలించాలి.? ఖర్చు ఎలా తగ్గుతుంది.? అనే అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.


శ్రీశైలానికి డైరెక్టుగా గోదావరి జలాలను తరలించాల లేదా.? నాగార్జున సాగర్ కు తరలించి అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించాలనేది పెద్ద ప్రశ్న.గోదావరి జలాలను కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు దుమ్ముగూడెం టెయిల్ పాండ్ కరెక్టనేది అధికారుల భావన. దీంతో పాటు కంతనపల్లి ఆప్షన్ కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లను శ్రీశైలంకు తరలించే మార్గాలను అద్యయనం చేస్తున్నారు. ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తరువాత నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని తరలించాలనేది ప్రభుత్వాల ఆలోచన. ఇంద్రావతి కలిసిన తర్వాత 2,488 టీఎంసీలు ఉంటే, శబరి కలిసిన తరవాత 3,082 టీఎంసీలు అందుబాటులో ఉంటున్నాయి.దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. "గోదావరికి సంబంధించిన నాలుగు పాదాల్లో మూడు పాయలు తెలంగాణ దాటిన తరువాతనే మనకొస్తాయి.



ఇక మనకు గోదావరి నుంచి వచ్చే నీళ్ళు ఏమిటి అని చెప్పి చూస్తే అధ్యక్ష, అది ఒక శబరి సబ్ బేసిన్ నుంచి మాత్రమే వస్తుంది. అది ఒక జి12 సబ్ బేసిన్. అదే సీలేరు,అదే శబరి అన్నీ కలిసి మనకిందకొస్తాయ్.అద్యక్షా ఇది మనకు చత్తీస్ గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి కాస్తో కూస్తో మనకొచ్చే సబ్బేసిన్ అద్యక్ష దీన్ని టోటల్ యీల్డ్ గోదావరి బేసిన్ ఈ సబ్ బేసిన్ నుంచి ఎంతా చెప్పి    చూస్తే అధ్యక్ష శబరి నుంచి, కేవలం పన్నెండు శాతం.కేవలం పన్నెండు శాతం మాత్రమే అధ్యక్ష, మనకు గోదావరి నీళ్లు డైరెక్టుగా మన రాష్ట్రంలోకి వచ్చేటివి.మిగిలిన మూడు పాయలు మిగిలిన మూడు గోదావరికి సంబంధించిన మూడు పాయలు తెలంగాణ దాటుకునే మనకొచ్చేటివి." అని అన్నారు. అభయారణ్యం అటవీ భూములు అధికంగా ఉంటే అటవీ పర్యావరణ అనుమతులు రావడం కష్టం  అవుతుంది. ఈ నేపథ్యంలో అటవీ భూములు తక్కువగా సేకరించేలా అభయారణ్యం తప్పిస్తూ గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు తరలించేలా ఎలైన్ మెంట్ ను రూపొందించాలని ఇరు రాష్ర్టాల ప్లాన్.

మరింత సమాచారం తెలుసుకోండి: