కాసేపట్లో బెంగళూర్ లో దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ అధికారులు సమావేశం కానున్నారు. తెలంగాణ ట్రాన్స్ కో నుంచి ఎస్సీ హాజరయ్యారు. ఆగస్టు 1వ తేదీ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని కేంద్రం డిస్కమ్స్ ని ఆదేశించింది. అయితే దీనికంటే ముందే డిస్కమ్ లు ఎల్సీల ద్వారా విద్యుత్ వినియోగానికి నగదు చెల్లించాయి. కేంద్రం ఆదేశాల అమలుకు ఒక్క రోజు వ్యవధే మిగిలి ఉండటంతో డిస్కం సందిగ్ధంలో పడ్డాయి. తెలంగాణ విద్యుత్ అధికారులకు ఒక కొత్త సమస్య వచ్చిపడింది.ముఖ్యంగా డిస్కంకి సంబంధించి, విద్యుత్ ఉత్పత్తి సరఫరాలకు సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో డిస్కంలకి సంబంధించి ఇవి పెద్ద సమస్యగా చెప్పొచ్చు.


ఆగస్టు 1వ తేదీ నుంచి లెక్కల ఆధారంగా నగదు చెల్లించాలని చెప్పేసి కేంద్ర విద్యుత్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక లెటర్ ని  కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల ప్రకారం ఆగస్ట్ 1 నుంచి కంపల్సరీగా మనం వాడుకోబోయే విద్యుత్ కు సంబంధించి ముందుగానే చెల్లింపులు చేస్తేనే విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పేసి కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారిచేయటం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే దక్షిణాది విద్యుత్ రాష్ట్రాలన్ని కూడా దీనికి సంబంధించి ఇలాంటి నిబంధన తీసుకురావటం వల్ల ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ను అదేవిధంగా నిరంతరం  విద్యుత్ ను అందించలేము, దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి ఒక లేఖను కూడా దక్షణాది విద్యుత్ రాష్ట్రాలు రాయటం జరిగింది.దీనికి సంబంధించి ఈ రోజు ఒక కీలక సమావేశం జరుగుతుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ ఆదేశాలను అమలు చేయాల్సి వస్తే కంపల్సరీగా అన్ని రాష్ట్రాల మీద ఇబ్బందులూ ఉంటాయి. అదేవిధంగా నగదుకు సంబంధించి కూడా ఏ రాష్ట్రం గాని, ఏ విద్యుత్ సంస్థకి సంబంధించి గాని వేల కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేసి ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలంటూ మీటింగ్ లో నిర్ణయం తీసుకొని ఒక లేఖను కూడా రాయడం జరిగింది.


ఆ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, దాదాపుగా అన్ని రాష్ట్రాలతో ఎగువ, మధ్య తరగతి, అదే విధంగా పేదలకు గొప్ప ఉచిత విద్యుత్తును అందించడం జరుగుతుంది. వాటికి సంబంధించిన విద్యుత్ బిల్లులన్ని కూడా ఇప్పటికే బకాయిలున్నాయి.దీనితోటి రాష్ర్టాల్లో డిస్కంలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కూడా డబ్బులివ్వలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో కచ్చితంగా ఈ నిర్ణయాన్ని కేంద్రం వాయిదా వేసుకోవాలని చెప్పేసి డిస్కంలకు చెప్పటం జరిగింది. విద్యుత్ పంపిణీ కావచ్చు అదే విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్ని కూడా చాలా లాస్ లో ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తే అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందని కూడా చెప్పటం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే ట్రాన్స్ పో అధికారులు బెంగళూరులో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది.ఆగస్టు 1వ తేదీ నుంచి జరగబోయే ఈ అమలుకు సంబంధించి దీనిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే విషయంకి సంబంధించి ఇప్పటికే మీటింగ్ ప్రారంభం అయ్యి ఈ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది.ఈ రెండ్రోజులలో అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి రెండు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కచ్చితంగా 31వ తేదీ లోపు ఎంపీలన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.


వాడుకోబోయే విద్యుత్ కు సంబంధించి ముందస్థుగా డబ్బులన్ని కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే తెలంగాణ ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ లేఖ కూడా రాయడం జరిగింది. ప్రస్థుతం ఒక నెలకు సంబంధించి నెలకు 1,100 కోట్ల రూపాయలను వీళ్ళు అడ్వాన్స్ గా కేంద్రానికి కట్టాల్సిన పరిస్థితున్న నేపథ్యంలో ఎంతో కొంత అడ్జెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నాం వాటిని కేంద్రానికి కడతామని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ సీఎండీ ప్రభాకర్ రావు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఇది గుదిబండగా మారకుండా ఉండేందుకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటే మంచిది అనిచెప్పేసి లేఖలో పేర్కొన్నారు. అయితే కేంద్రం ఒక నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉంది.ఇది ఆ నిర్ణయం వెల్లడించేంతవరకు వీరు మాత్రం ఆగస్టు 1వ తేదీ నుంచి కేంద్రం ఇస్తున్న ఆదేశాలు అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: