భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ప్రభుత్వమే అందరికీ నాణ్యమైన విద్యను అందించాలి. ఏ దేశంలో అయినా పేదరికం పోయిందంటే, బాగా అభివృద్ధి జరిగిందంటే దానికి పునాది పాఠశాల విద్య, కాలేజి విద్య, విశ్వవిద్యాలయ విద్య అనేది చారిత్రక సత్యం. కానీ ఈ మద్య కొంత మంది విద్యాశాఖలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాద్యాయులుగా వెళ్లిన వారు ఎక్కువ సేపు ఫోన్ కాల్స్ తోనే స్మార్ట్ ఫోన్ తోనే కాలం గడుపుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంతో విద్యార్థులుకు చదువు పట్ల అసహనం, కొత్తది నేర్చుకోవలన్న కుతూహలం మొత్తం కోల్పోతున్నారు.  అంతే సరైన విద్యలేక ఇబ్బందులు పడటం..తక్కువ మార్కులు తెచ్చుకోవడం జరుగుతుంది.  అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ఇలా జరుగుతుందని విద్యార్థుల పట్ల  ఉపాధ్యాయులకు శ్రద్ద ఉండదని భావిస్తున్న తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అది వారి తలకు మించిన భారమైనా తప్పని పరిస్థితుల్లో పంపుతున్నారు.

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మాత్రం నెలసరి జీతం టెన్షన్ గా తీసుకుంటున్నారు.  తాజాగా ఇలాంటి పరిణామాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పాలని ఏపి సీఎం వైఎస్ జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.  ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు ఫోన్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. రాష్ట్రంలోని  ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తామని ప్రకటించిన జగన్.. ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. 

 ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు గానూ తరగతి గదిలో టీచర్ల ఫోన్ వినియోగంపై కఠిన నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై క్లాస్ రూంలో టీచర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్‌ఫోన్లు వినియోగించరాదని ఆదేశించారు.  ఒకవేళ తరగతి గదిలో టీచర్ వద్ద మొబైల్ ఉన్నట్లు రుజువైతే సదరు ఉపాధ్యాయుడితో పాటు స్కూల్ హెడ్మాస్టర్‌పైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: