సామాన్యుడికి వాత - డిపాజిట్ వడ్డీ రేట్లపై భారీ కోత

సామాన్యుడికి మింగుడుపడని మరో నిర్ణయం వెలువడింది.   బ్యాంకు డిపాజిట్ల పై వచ్చే వడ్డీ డబ్బులతో బతికే విశ్రాంత ఉద్యోగులు  మరియు మన దేశ సీనియర్ సిటిజన్స్ కు చేదు వార్త.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు బల్క్ డిపాజిట్ తో కలిపి అన్ని రకాల  ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును భారీగా తగ్గించింది. ఈ నిర్ణయం ఆగస్టు 1  2019 నుండి అమల్లోకి వస్తుందని తెలియజేసింది. అన్ని కాలపరిమితి గల డిపాజిట్ల కి ఈ నిర్ణయం  వర్తిస్తుందని బ్యాంకు తెలియజేసింది ది

 బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు

  1. 7 నుంచి 45 రోజుల  కాలపరిమితి గల డిపాజిట్లపై బ్యాంకు 75 బేసిస్ పాయింట్లు  తగ్గించింది

  2. రెండు నుంచి మూడు సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై బ్యాంకు  10 బేసిస్ పాయింట్లు తగ్గించింది

  3.  3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై 5 బేసిస్ పాయింట్లు  తగ్గించింది ఈ తగ్గింపుతో 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటు  6.6 శాతం గా ఉండవచ్చు.

  4. 46 నుండి 179 రోజులు  డిపాజిట్ పై 5.75 శాతం వడ్డీ ఇస్తున్నట్లు  బ్యాంకు ప్రకటించింది

  5.  150 నుంచి 200 పదిరోజుల వ్యవధి గల డిపాజిట్లపై 6.25 శాతం  ఇవ్వనున్నట్లు తెలియజేసింది 

ఆగస్టులో రానున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ లో ప్రభుత్వం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను  తగ్గించడానికి ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ కూడా దీనికి సుముఖంగానే ఉన్నారని సంకేతాలు  వెలువడుతున్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: