ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఏమైనా సాధిస్తారు. ఆరు నెలల్లో ఆంధ్ర ప్రజల చేత మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అని అన్నారు. కానీ అంత సమయం కూడా తీసుకోలేదు మన ముఖ్యమంత్రి. కేవలం 50 రోజులలోనే ఆయనంటే ఏంటో చూపించారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 


పుట్టిన పాపా నుంచి వయోవృద్ధుడు వరుకు ప్రతి ఒకరికి మంచి జరిగేలా రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటూ వారి కోసం సంక్షేమ పధకాలను తీసుకొచ్చారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో డబ్బు లేక పిల్లలు చదవకుండా ఉండకూడదు అని బాలలు 'బాల కార్మికులు' కాకూడదని వారికోసం అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చారు వైఎస్ జగన్. 


ఈ తరహాలోనే ఈరోజు ట్విట్టర్ వేధికగా 'విద్య అనేది వ్యాపారం కాదు అంటూ పేద, మధ్యతరగతి విద్యార్థులకు చదువు అందుబాటులోకి రావాలని, అందుకోసం రిటైర్డ్ హైకోర్టు జడ్జిల ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీల ఫీజులపై నియంత్రణ, మౌలిక సదుపాయాలపై పర్యవేక్షణకు కమిషన్లను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లులను ఆమోదించాం.' అంటూ ట్విట్ చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. 


ఈ ట్విట్ కు ఎంతోమంది నెటిజన్లు స్పందించారు. అలానే ఓ తమిళనాడు యువకుడు కూడా స్పందించాడు. అతను ట్విట్ చేస్తూ 'జగన్ గారు నా స్వస్థలం చెన్నై, తమిళనాడు. మా తమిళనాడు ప్రజలకు మీలాంటి యువ నాయకుడు ముఖ్యమంత్రిగా కావాలి సర్.' అంటూ ట్విట్ చేశాడు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: