ఆంధ్రప్రదేశ్ ముఖ్య నగరమైన విజయవాడ ప్రధానమైన పట్టణం. ఇక్కడ అనేక వ్యాపార, వాణిజ్య లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రయాణీకుల పరంగా కూడా అత్యంత రద్దీ గల ప్రదేశం. ఇక మార్కెట్, బీసేంట్ రోడ్, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగు వరకు నిత్యం వాహనాల రద్దీ ఉంటూనే ఉంటుంది.... నగరం వ్యాపార పరంగానూ, పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో నగర అభివృద్దికి ఎంతగానో కృషి చేశారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట విభజన అనంతరం రాజధాని అమరావతి విజయవాడకు దగ్గరలో ఉండటంతో నగరం అభివృద్ధి మొదలైంది. నగర అభివృద్ధికి తోడు నగర ట్రాఫిక్ కూడా ఎక్కువైంది. దీంతో ఎప్పకప్పుడు ట్రాఫిక్ ను మళ్ళించే ప్రయత్నంలో ట్రాఫిక్ అధికారులు చోరవ చూపుతూనే ఉన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లన్ని చిత్తడిగా మారడంతో ఇంకా పేరిగే అవకాశం ఉంది.

తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ బుధవారం నగర ట్రాఫిక్ మళ్ళిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు  నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు విదిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. విజయవాడ నగరంలో ఉదయం 8 గంటల నుంచి 31వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ట్రాఫిక్‌ మళ్లింపు చేస్తున్నారన్నారు.

ప్రకాశం బ్యారేజీ సమీపంలోని మోడల్‌ గెస్ట్‌హౌస్‌ వద్దరదే ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు. బ్యారేజీ వైపు నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే వాహనాలు యథాతథం తిరుగుతాయని, కుమ్మరిపాలెం నుంచి విజయవాడ వచ్చే వాహనాలు మళ్లింపు చేపట్టగా ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలకు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ మల్లింపు గుర్తించి ప్రయాణాలు చేపట్టాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఉన్నవారు ముందుగానే ట్రాఫిక్ మళ్ళింపు ఏటు ఉందో చూసుకోని ట్రాఫిక్ తక్కువ ఉన్న రూట్లను ఎంచుకోవాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: