ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చింది.దీంతో అసెంబ్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం అన్న జగన్ వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.


అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో కొందరు ఎమ్మార్పీఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ర్యాలీ, ధర్నాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఇటు బెజవాడలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మాత్రం ఎవరిని కూడా అసెంబ్లీ వైపు వెళ్లకుండా ఉండేందుకు గాను బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రస్తుతం  ప్రకాశం బ్యారేజి వద్ద  ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ, పోలీసులు ప్రకాశం బ్యారేజీ మీదుగా అనుమతిస్తున్నారు. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి నుంచి తాడేపల్లి అదే విధంగా అసెంబ్లీ వైపుకు వెళ్లే ప్రతి వాహనాన్ని కూడా వాళ్ళు తనిఖీ చేస్తున్నారు. ఎందుకంటే సీఎం వైఎస్ జగన్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ చేసినటువంటి వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలంటూ కూడా మందక్రిష్ణ మాదిగ ఇవాళ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో జిల్లాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఈరోజు అసెంబ్లీ వైపుగా దూసుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి వాహనాన్ని అదే విధంగా వెహికల్స్ అన్నింటిని కూడా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఉండవల్లి వైపు అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ మీదకు అనుమతిస్తున్నారు. నిన్న పోలీసు వారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది.

ర్యాలీలు, ధర్నాలు చేయటానికి ఎలాంటి అనుమతి లేదు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో వాటిని ఆటంకపరిచే విధంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి ఇప్పటికే అటు పోలీసులు కూడా హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కేవలం ఒక నలుగురైదుగురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తాడేపల్లి అదే విధంగా అసెంబ్లీ వైపుగా వెళ్లటానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు కూడా తరలించారు. అన్ని జిల్లాలలో కూడా ఎక్కడికక్కడ కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరుగుతుంది. కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మాత్రమే అసెంబ్లీ దగ్గర తమ నిరసన వ్యక్తం చేయాలంటూ కూడా చేసినటువంటి పిలుపుకు పెద్ద ఎత్తున ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వస్తారని  భావించినప్పుడు రెండ్రోజుల నుంచి ముందస్తు గానే పోలీసులతై మాత్రం వారందరను కూడా అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు అటు వారధి వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటటువంటి వాహనాలు ఎక్కడైతే జగ్గయ్యపేట దగ్గరుండుంటే గరికపాడు చెక్ పోస్టు ఉంది.అక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తూ ఎవరిని కూడా అటు అసెంబ్లీ వైపుగా రాకుండా ఉండేందుకు గాని పోలీసులైతే మాత్రం అడ్డుకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఫెర్రీ దగ్గర నుంచి కూడా కొంతమంది పడవల్లో వస్తారని ఒక ఇంటెలిజెన్స్ సమాచారంతో పోలీసులు అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేసి ఎవర్ని కూడా కృష్ణా నదిలోకి అనుమతించకుండా అనుమతిస్తే అట్నుంచటు అమరావతి వైపుగా వచ్చి అటు అమరావతి నుంచి నేరుగా అసెంబ్లీని ముట్టడించే అవకాశాలున్న నేపథ్యంలో పోలీసులు అక్కడ కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.


అసెంబ్లీ చుట్టు పక్కల 144 సెక్షన్ అదేవిధంగా సెక్షన్  పోలీసు చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో ఎవరూ కూడా ధర్నాలు ర్యాలీలు నిర్వహించకూడదంటూ కూడా నిన్నటి నుంచి పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్త వస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ అదే విధంగా ప్రకాశం బ్యారేజీ వద్ద కనకదుర్గమ్మ వారధి వద్ద అదే విధంగా అటు గుంటూరు జిల్లా నుంచి వచ్చేటటువంటి ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను కూడా అటు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ల కుండా ఉండేందుకు గాను అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది.కేవలం ఒక నలుగురైదుగురు మాత్రం ఇప్పటి వరకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు మందక్రిష్ణ మాదిగ ఇచ్చిన పిలుపును వ్యతిరేకంగా మరొక వర్గం కూడా ఇవాళ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి అసెంబ్లీకి ఒక శాంతియుత ర్యాలీ నిర్వహించాలనుకున్నప్పుడు కూడా ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని చెప్పినటువంటి పోలీసులు అటు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వ్యతిరేకంగా మరొక వర్గం నిర్వహించబోతున్నటువంటి ఆ ర్యాలీకి కూడా అనుమతి లేదు. దాన్ని కూడా పోలీసులు భగ్నం చేయడంతో పాటు కొంత మందిని అదుపులోకి కూడా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: