వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభ ఇప్పటికే ఆమోదించింది. అయితే రాజ్యసభలో బిల్లుకు ఆమోదం లభిస్తుందా లేదా అన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందడానికి కావాల్సిన సంఖ్యాబలం ప్రభుత్వానికి లేదు. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా బిల్లు ఆమోదానికి 121 మంది ఎంపీల మద్దతు అవసరం. ఎన్డీయే బలం 104 అయితే ఎన్డీయే భాగస్వామి పక్షం జేడీయూ బిల్లును వ్యతిరేకిస్తుంది.జేడీయూకు రాజ్యసభలో 6 ఎంపీలున్నారు. అన్నాడిఎంకె ఇంకా తమ వైఖరిని ప్రకటించలేదు.ఇక కాంగ్రెస్ తృణమూల్ సమాజ్ వాదీ బీఎస్పీ ట్రిపుల్ తలాక్ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.


ట్రిపుల్ తలాక్ బిల్లును సుప్రీం కోర్టు ఇప్పటికే నిషేదించిందని దీనికోసం ఇక ప్రత్యేక చట్టం ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఇప్పటికీ ఈజిప్ట్, టర్కీ, సైప్రస్, ఇరాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాలు ట్రిపుల్ తలాక్ ను నిషేధించాయి. కాంగ్రెస్ బీజేపీలకు సమాన దూరం పాటిస్తున్న పార్టీల వైఖరిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. టీఆర్ ఎస్, వైసీపీ పార్టీలు బిల్లుపై ఇలాంటి వైఖరి తీసుకుంటుందన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది.పేద ముస్లిం మహిళలకు న్యాయం చేయడం కోసమే ఈ బిల్లును తెచ్చినట్లుగా న్యాయశాఖామంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.చిన్న చిన్న తగాదాలను సాకుగా చూపి ముస్లిం మహిళలకు విడాకులు ఇస్తున్నారని ఆరోపించారు.ట్రిపుల్ తలాక్ బిల్లుకు మతం రంగు పులమడం సరికాదు అన్నారు.


ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో లోక్ సభలో బిల్లు పాసైన సందర్భంలో టీఆర్ ఎస్ ఎంపీలు ఆ సభకు హాజరు కాలేదు. తద్వారా ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా వ్యతిరేకతను ఓట్ల రూపంలో వాళ్లు ఎంపీలు చెప్పలేకపోయారు.అయితే ఈ రోజు రాజ్యసభలో వారి సంఖ్యాబలం ఆరు ఉంది. ఈరోజు మరి సభకు హాజరవుతారా లేదా, హాజరైన వాళ్లు వ్యతిరేకంగా ఓటు వేస్తారా లేదా, ఆ సమయానికి వాకౌట్ చేసి బయటకి వస్తారా అన్నదాని మీదైతే ఆ పార్టీ ఇంకా స్పష్టత నివ్వడం లేదు. కాకపోతే ఈ బిల్లు విషయంలో మాత్రం వారి వైఖరి వ్యతిరేకంగానే ఉంది.ఎందుకంటే ఇందులో క్రిమినలైజేషన్ అన్న అంశాన్ని టీఆర్ ఎస్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది.ఇది వివాహ చట్టాల్లో ఎప్పుడూ కూడా నేరమయం చేయడమన్నది తగదు.


అలా చేయడం ద్వారా క్రిమినల్ కేస్ పెట్టి భర్తను దేశంలో ఉంచితే ఆ కుటుంబానికి ఆర్థికంగా గానీ ఇతరత్రా గాని ఆసరాగా ఇంకెవరుంటారు అన్నదాని మీద చాలా రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి.ఆ నేపథ్యంలోనే టీఆర్ ఎస్ కూడా క్రిమినలైజేషన్ తో పాటు మరి కొన్ని అంశాలను వ్యతిరేకిస్తుంది తప్ప పూర్తిగా బిల్లునువ్యతిరేకించటం లేదన్నది ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ మద్య మార్గంగా అటు వ్యతిరేకంగా ఓటు వేయకుండా అలాగని సభలో అనుకూలంగాను ఓటు వేయకుండా సభకు గైర్హాజరవడం అనే వ్యూహాన్ని ఎంచుకొనేటట్టుగా మనకి కనిపిస్తుంది. ఎందుకని అంటే దాదాపు ప్రతి పక్షాలలో అనేక రాజకీయ పార్టీలు తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేసి ఖచ్చితంగా సభలో ఉండాలి అంటూ పేర్కొన్నాయి.



కాని టీఆర్ ఎస్ మాత్రం ఎటువంటి పీపుల్ విప్ ను జారిచేయలేదు. అలాగే టీఆర్ ఎస్ కి చెందిన ఒక ఎంపీ డిఎస్ అయన ఇంకా డిల్లీలో కూడా లేరు.ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే సభకు గైర్హాజరవడమా లేకపోతే ఆ సమయానికి వాకౌట్ చేసి బయటికి రావడమా అన్నదాని మీదనే ఇంకా టీఆర్ ఎస్ ఎంపీలు నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యసభ నుంచి జనతాదళ్ యునైటెడ్ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు జేడీయూ ఎంపీ వశిష్ఠ నారాయణ్ సింగ్. మహిళలకు సమాన హక్కులు కావాలని తమ పార్టీ కోరుకుంటుందని అయితే దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉండకూడదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: