ఈ రోజు విజయవాడ రైల్వే ప్రధాన ద్వారం వద్ద అన్ని కార్మిక సంఘాలు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మోడీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి మొత్తం రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరించాలని పారిశ్రామిక వేత్తలకూ కట్టబెట్టాలన్న యోచనతో ఇష్టం వచ్చినట్టు జీవోలు జారీ చేస్తున్నారని చెప్పి కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోక పోవటంతో దేశవ్యాప్తంగా ఆందోళన శ్రీకారం చుడతామని ఇప్పటికే వామపక్ష నేతలు కూడా ప్రకటించారు. మోడీ తీరు అలాగే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలిపై స్పందించేందుకు కొందరు సిపిఎం నాయకుల బాబురావు గారితో పాటు ఇతర నాయకులు కూడా ఉన్నారు.


మోడీ ప్రజలను మాయచేసి ఎన్నికల్లో గెలిచారు. బిజెపి వాళ్లకి ఎన్నికల్లో కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలు కట్టబెట్టారు. వాళ్ళ రుణం తీర్చుకుంటున్నారు మోడీ గారు ఇప్పుడు. మొత్తం రైల్వే రంగాన్ని ప్రైవేటు పరం చేసేస్తున్నారు. సిగ్గు చేటు నిన్నే మన్ కీ బాత్ లో మోడీ గారు చంద్రయాన్ 2 గురించి మాట్లాడారు. చంద్రయాన్ 2 కంటే కూడా ప్రెవేటీకరణకు చాలా ఎక్కువగా ఉంది. నిర్భీతి అన్నాడు ఆయన నిర్భీతి అంటే అడ్డగోలుగా ప్రైవేటీకరణ చేయడం కాదు నిర్భీతి అంటే రైల్వేలు ప్రభుత్వరంగం ఉండటం వల్లనే మన దేశం యెక్క స్వాతంత్య్రం సార్వభౌమత్వం ఆధారపడింది. ఇవాళ రైల్వేల్ని ప్రైవేటు వాళ్ళకి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టిన తరువాత మన దేశ స్వాతంత్య్రమే తాకట్టు పెట్టడం దేశభక్తి గురించి మాట్లాడే నైతిక అర్హత మోడీ కోల్పోయారు.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే రంగం కావున దీనిని నాశనం చేస్తున్నారు.


బెజవాడ రైల్వే స్టేషన్ ని 40 ఏళ్ళ పాటు ప్రైవేటు కంపెనీలకు దాఖలు చేయటానికి టెండర్ పిలిచారంటే ఇంకా ఏం మిగులుతాయి. మోడీని గెలిపించింది కాపాడమని గెలిపిస్తే ఈయన నాశనం చేస్తా ఉన్నారు. అందుకే రైల్వే రంగం నీ సొమ్ము కాదు. దీన్ని కాపాడుకోవటం కార్మిక సంఘాల చేసే ఆందోళనకి వామపక్షాలు సీపీఎం కూడా మద్దతు నిస్తాం ఇది ప్రజల సమస్య కార్మికుల సమస్యే కాదు. రైళ్లలో ఈ రోజు చేయడం వల్ల ఉద్యోగస్తులు ప్రమాదం అనుకుంటున్నారేమో వాళ్ళ రైళ్లు ప్రభుత్వ రంగంలో ఉండబట్టే చౌకైన ధరలకే సాధారణ ప్రజలకు ఇది అందుబాటులో ఉంది. రేపు ఈ రైల్వే రంగం లేకపోతే ప్రయాణీకుల మీద విపరీతమైనటువంటి భారం పడబోతోంది.


ఇటు కార్మికులు ప్రయాణికులు ప్రజలు ఇది దేశ భవిష్యత్తుకి సంబంధించిన అంశం. దీనిమీద పోరాటం సాగించే దానికి కమ్యూనిస్టులుగా మేము మద్దతు పూర్తిగా తెలియజేస్తాం.ఇప్పటికే చాలా విడతల వారిగా చేస్తున్నారు చాలా చోట్ల ఒత్తిడి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా ఐక్యంగా ఉద్యమించి మోడీపై ఏదో విధంగా ఒత్తిడి తీసుకురానున్నారు. ఒకటి ప్రపంచంలోనే అత్యంత కొన్ని లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రైల్వేస్ ని ఈ రోజున ప్రైవేటు పరం చేయటానికి ప్రయత్నించటం. కార్మికుల మీద ఇటు ప్రజల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించే వ్యవహారం అన్నీ రేట్లు పెరుగుతాయి.


తరవాత ఇది ఆల్రెడీ ప్రైవేటుపరంగా కొన్ని మెట్రో రైల్స్ ని వాటిని కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి బదలాయించడం జరిగింది.ఢిల్లీ ఘజియాబాద్ ఆ మధ్యలో రిలయన్స్ వాళ్ళకీ ఇచ్చారు.ఒక టెస్టు మార్కెటింగ్ కింద ఒక మెట్రో టికెట్ అంతకుముందు 5 నుంచి 7 రూపాయల 12 రూపాయ లుండేది ఈ రోజు 125 రూపాయల దాకా పెరిగిపోవటం కూడా మనం చూశాం. కనుక ఏవిధమైనటువంటి ప్రమాదం ఈ రోజును పొంచివుంది.వాళ్ళు చేసిన వాగ్ధానాలు ఎలక్షన్ మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలకు పూర్తి భిన్నంగా ఈ రోజున రైల్వేస్ ని ప్రైవేటీకరించటానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నించడం చాలా శోచనీయమైన విషయం. అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అన్ని పార్టీలూ అట్లాగే మేం కూడా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కూడా దీంట్లో ఖచ్చితంగా ప్రధానమైనటువంటి భువికి నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి ఈ ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రం ఖచ్చితంగా తిప్పి కొట్టడానికి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతాం.



ఇవాళ రెండో సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం చాలా నిస్సిగ్గుగా ప్రభుత్వ రంగ సంస్థలే ప్రైవేటీకరించటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. అందులో రైల్వేలు ప్రధానమైన విషయం. ముఖ్యంగా రైల్వేల ప్రజాబాహుళ్యంలో చాలా చౌకానేటువంటి రేట్లతో ప్రయాణించే అవకాశముంది. అలాగే వృద్ధులకే మహిళలకే కాలేజీ విద్యార్థులు గాని పిల్లలనగానే బోలెడు రాయితీలు ఇచ్చి సౌకర్యంతోనే ప్రయాణం చేయాటానికి ఉపయోగపడతా ఉంది.భవిష్యత్ లో ఇది ప్రైవేటీకరణ జరిగే పక్షం అయితే మొత్తం ఇలా ఈ రకమైన రాయితీలన్ని పోవటమే కాకుండా అతను మోయలేని భారంతో రైల్వే ప్రయాణం అనేది ఒక విమాన ప్రయాణంలాగా తయారై దానికంటే అధికంగా తయారయ్యేటువంటి పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది.



అందువల్ల ఏంటంటే దీన్ని ఈ స్థితిలో గాని ఎదుర్కోకపోతే చాలా ప్రమాదకర స్థితిలోకి ప్రజలు నెట్టపడతారు కాబట్టి అన్ని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అలాగే యూనివర్సిటీ ఉద్యోగుల సంఘంగా మేం కూడా ఈ సమ్మె ఈ విషయం నుంచి ప్రభుత్వం బయటకొచ్చేవరకు ఈ సమ్మెలో కొనసాగుతామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆ రైల్వే ప్రైవేటీకరణపై అన్ని కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: