పెద్దపల్లి వివేక్  టీఆర్ఎస్ పార్టీలో మనకు బాగా తెలిసిన పేరు. ఆయన ఆ పార్టీని వీడిన తరువాత చాలా కన్ఫ్యూషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఇప్పటి వరకు ఏ పార్టీ కండువా చేపడతారో  తెలీక ఇటు ఈయన అటు పార్టీలు  అయోమయంలో ఉన్నాయట.వివరాళ్ళోకి వెలితే వివేక్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత  కాసేపు బీజేపీకి దగ్గరై పోయినట్టు సంకేతాలు తెలుపుతున్నారు, తీరా చూస్తే అమిత్ షాను కలిసి వినతి పత్రం ఇచ్చి వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ కండువా వేసుకుని ఏది లేదన్నట్టుగా  సీన్ క్రియేట్ చేస్తున్నారు, మళ్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారు.


కన్ఫ్యూజన్ తో పార్టీలకతీతంగా వుండటానికి అటు బిజెపి లో చేరడానికి కన్ఫ్యూజన్ ఇటు కాంగ్రెస్ గూటికి వెళ్లడానికి కన్ఫ్యూజన్ ఏం చెయ్యాలో తెలియక వివేక్ గారు తికమకపడుతుంటే అటు కాంగ్రెస్ బీజేపీ కండువాలు కూడా గందరగోళానికి గురవుతున్నాయట.టిఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ పార్టీ లోనూ చేరలేదు అదే సమయంలో సెక్రటేరియట్ ఎర్రమంజిల్ భవన్ కూల్చివేత మీద పోరాటం మొదలు పెట్టారు. తరువాత ఆయన  బీజేపీలో చేరడానికి దాదాపుగా రెడీ అయిపోయారు అనుకున్న సమయంలో చివరి నిమిషంలో కాషాయ కండువా వేసుకునే  విషయంలో డ్రాప్ అనేశారట. అమిత్ షాకి వినతి పత్రం మాత్రమే ఇచ్చి ప్రస్తుతానికి ఇంతే సంగతులు అనేశారు.


టిఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తిరిగి సొంత గూటికి చేరుతారని భావించిన కాంగ్రెస్ నేతలు సెక్రటేరియట్ ఎర్రమంజిల్ భవన్ కూల్చివేతపై వివేక్ మొదలు పెట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించారు. చివరకు వివేక్ అమిత్ షాని కలవటానికి ఢిల్లీ వెళ్లడంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ పీసీసీ నేతలకూ మొట్టికాయలు వేసిందట. పార్టీ తరపున యాక్టివ్ గా చేయకుండా ఎవరో స్వతంత్రంగా చేసే పోరాటాలు చేస్తే సపోర్ట్ చేయడం ఏంటని ఇలా జరిగిపోయిందేంటని టీఆర్ ఎస్ కాంగ్రెస్ నేతలు కిందామీదాపడుతున్నాయట.


ఇదిలా ఉండగా ఢిల్లీలో కాషాయ కండువా వేసుకోకుండా జస్ట్ వినతిపత్రమిచ్చి వెనకొచ్చేశారు. వివేక్ దీంతో మళ్లీ తెలంగాణ కాంగ్రెస్ వివేక్ ని ఆకర్షించే ప్రయత్నాలు ప్రారంభించింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివేక్ ఇంటికి వెళ్లొచ్చారు, మొదట ఆషాడం కావడంతో వివేక్ బీజేపీలో చేరలేదని ప్రచారం జరిగింది ఒకవేళ అదే నిజమైతే తనను పార్టీ లోకి రమ్మని పిలిచే అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఇవ్వకూడదు కానీ, ఇచ్చారు ఒకపక్క  ఢిల్లీలో అమిత్ షాని కలిశారు. హైదరాబాద్ లో ఉత్తమ్ తో చర్చలు జరుపుతున్నారు. దీంతో అసలు ఏ పార్టీ లో చేరాలన్న క్లారిటీ లేక ఆయన తికమక పడుతూ ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ను తికమకపెడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చిస్తున్నారు. మరి ఇప్పటి కైనా వివేక్ ఒక స్పష్టత కు వస్తారా లేక తన రాజకీయ భవిష్యత్తును ఆయనే మరింత గందరగోళంలో పడేసుకుంటారా అన్నది చర్చ నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: