మాజీ ముఖ్య మంత్రి భాజపా నేత ఎస్ ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమైన ఘటన కలకలం రేకెత్తిస్తోంది. మంగళూరులో నేత్రావతి నది వద్ద సోమవారం సాయంత్రం సిద్ధార్థ కనిపించ కుండా పోయినట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం అతని ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అటు కాఫీడే సిబ్బందిని ఉద్దేశించి సిద్ధార్ధ రాసిన లేఖతో ఆయన ఏమయ్యారనేది అనుమానాస్పదంగా మారింది. కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు యజమాని అయిన సిద్ధార్థ అదృశ్యమయ్యాడు. సోమవారం సాయంత్రం నేత్రావతి వంతెనపై వెళుతుండగా డ్రైవర్ ని కారు పక్కకు నిలపాలని ఆయన సూచించారు.


కారు దిగి బంతిపై నడుస్తూ సాయంత్రం ఆరున్నర గంటల వరకు ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నారు. అలా కొద్ది సేపటి తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో డ్రైవర్ ఆందోళనకు గురయ్యాడు.దాన్ని వెంటనే సిద్ధార్థ సభ్యులకు తెలియజేసాడు. సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ పోలీసులు నదీ ప్రాంతంలో ముమ్మర గాలింపు ప్రారంభించారు. సిద్దార్థ కోసం రెండు వందలమందికిపైగా పోలీసులు గాలింపు గజ ఈతగాళ్ల సాయంతో నేత్రావతి నదిని జల్లెడ పడుతున్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇవాళ ఉదయం ఎస్ ఎం కృష్ణ నివాసానికి చేరుకుని గాలింపు చర్యలు సమీక్షించారు.మాజీ సీఎం కుమారస్వామి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ సైతం ఎస్ ఎం కృష్ణను పరామర్శించారు.ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన డీకే శివ కుమార్ విచారణకు డిమాండ్ చేశారు. సిద్ధార్థ దేశానికి ఆస్తి వంటి వాడని ఆయన అదృశ్యమయ్యార లేక ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న విష్యం  తెలియాలన్నారు.


అంతకుముందు కాఫీడే సిబ్బంది బోర్డును ఉద్దేసించి సిద్ధార్థ రాసిన లేఖ వెలుగు లోకొచ్చింది. సంస్థలో జరిగే ప్రతి ఆర్థిక లావాదేవికి తనదే బాధ్యత అన్న సిద్ధార్ధ తనకి ఎవరినీ మోసగించే ఉద్దేశం లేదని లేఖలో పేర్కొన్నారు. లాభాలు సృష్టించే వ్యాపార నమూనాను తయారు చేయలేకపోయినందుకు చింతిస్తున్నట్లు ఆ లేఖలో ఆయన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.ఎంత కష్టపడినా లాభాలు రాలేకపోయాయన్నారు.ఓ ప్రైవేట్ ఈక్విటీ లో భాగస్వామ్యులు షేర్లను బైబ్యాక్ చేయమని తమను బలవంతపెడుతున్నారని తెలిపారు.ఆదాయ పన్ను గత డీజీ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. వ్యాపారాభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నించిన తనపై నమ్మకం ఉంచిన వారినీ ఆదుకోలేకపోతున్నానని ఆయన వ్యక్తం చేశారు.ఇన్నాళ్లూ ఒత్తిడితో పని చేశానని, కానీ ఇప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నారన్నారు. తనను విఫల వ్యాపార వేత్తగా పేర్కొన్న సిద్ధార్ధ ఏదో ఒకరోజూ తనను అర్థం చేసుకుంటారని వెల్లడించారు. కొత్త యాజమాన్యంతో ఉద్యోగులంతా బలంగా ఉండి ఈ వ్యాపారాన్ని ఇలాగే కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: