కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎం ఎన్ సి ) బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం ఒక్కరోజు బంద్ చేసినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ  ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్ రెడ్డి, సంజీవ్ సింగ్ యాదవ్ మాట్లాడారు. పేదలకు వైద్య విద్యను దూరం చేసే విధంగా కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


నాడు రాజ్యాంగ నిర్మాతలు దేశ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక యాప్ ద్వారా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారని చెప్పారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఎం ఎన్ సి రద్దు చేసే విధంగా ఈ చట్టం ఉందని అన్నారు. మొత్తంగా ఈ బిల్లు ద్వారా గ్రామీణ పేదలు వైద్య విద్యను అభ్యసించే అవకాశం ని దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


తద్వారా పేదలకు వైద్యం అందరం కష్టం అవుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లు వైద్యుల కంటే చాలా రోజులకి అత్యంత ప్రమాదకరమని పేర్కొన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పునఃఆలోచించుకోవాలని వారు సూచించారు. అంతే కాదు ఇలాంటి బిల్లుల వల్ల వైద్యులను ఇబ్బందులుకు గురి చేయవొద్దని వారు ఈ సమావేశంలో పేర్కొన్నారు. 

వీటన్నింటి నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒక రోజు పాటు వైద్య సేవలను నిలిపి వేస్తున్నట్లు చెప్పారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి గురువారం ఉదయం 6 గంటల వరకు  వైద్య సేవలను నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అత్యవసర సేవలు అందిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ వైద్యులు శివలింగం, శ్రీనివాస్, గౌతమ్ ,మోహన్ గుప్త, ఎన్ కే యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: