మొయిన్ ఖురేషి కేసులో సానా సతీష్ లింకులు బయటపడుతున్నాయి . అధికారులు సానా ఐటీ రిటన్స్ పరిశీలిస్తున్నారు . లెక్కలు చూపని డబ్బు భారీగా సతీష్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఖురేషి ఫోన్ కాల్ డేటాని సీబీఐ వెలికితీసింది. ఖురేషీ సతీష్ మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు . ఈ లావాదేవిలన్నీ హవాలా ద్వారా జరిగినట్టు దర్యాప్తులో వెల్లడైంది. సతీష్ సహకారంతోనే ఖురేషి మనీ లాండరింగ్ కి పాల్పడినట్టు తేలింది. సిబిఐ దర్యాప్తు ఆధారంగా సానా సతీష్ ను ఈడీ విచారిస్తోంది

ఖతార్ నుంచి ద్రవీకృత సహజ వాయువు సరఫరా డీల్ పై ఈడీ విచారిస్తోంది . యూపీఏ హయాంలో జరిగిన ఈడీల్లో ఖురేషి పాత్ర పై ఈడీ విచారిస్తోంది . ఖురేషి పాత్ర పై సానా సతీష్ భిన్నమైన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది . 2017 జులై 11న ఈడీ కి సానా సతీష్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఎలెన్ జి డీల్ ఖురేషియే కుదిర్చారని తెలిపారు . డీల్ కుదిర్చే క్రమంలో ప్రభుత్వ అధికారులకు ముడుపులు చెల్లించేందుకు రూ.2.25 కోట్ల రూపాయలు ఖురేషి కి సానా సతీష్ ఇచ్చినట్టు ఈడీ గుర్తించింది.


మొత్తం వ్యవహారంలో సానా సతీష్ మనీ లాండరింగ్ కి కింగ్ పిన్ గా వ్యవహరించినట్లు తెలుస్తుంది . తాను దుబాయికి చెందిన డాన్ బంకరింగ్ సంస్థకూ ఏజెంటుగా ఉన్నందున ఖురేషిని కలిసినట్టు సానా సతీష్ అప్పట్లో ఈడికి ఒక స్టేట్ మెంట్ లో చెప్పారు . అయితే తాజాగ ఇచ్చిన స్టేట్ మెంట్ లో డాన్ బంకరింగ్ సంస్థ తనని కలిసి ఎల్ ఎన్ జి సరఫరా వ్యాపారంలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు సతీష్.


మరింత సమాచారం తెలుసుకోండి: