ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వైఎస్ జగన్మోహన్ రెడ్డి'పై మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడు ట్విట్టర్ లో విమర్శల వర్షం కురిపించారు. ఇందులో కొత్త ఏంలేదు లెండి, ప్రతిపక్ష నాయకుడు అన్నాక పాలకపక్షం అధికారిని విమర్శించకుండా ఉంటాడా ఏంటి అని అంటున్నారు నెటిజన్లు. 


15 ఏళ్ళు ఆంధ్ర ప్రదేశ్ ని పరిపాలించిన చంద్రబాబు నాయుడుకి ఇంకా ఆ పదవిపై మోజు తీరానట్టుంది అందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి ఏదొక విషయంపై పని పెట్టుకొని మరి విమర్శలు చేస్తూనే ఉన్నారు తండ్రి కొడుకులు అని అంటున్నారు నెటిజన్లు. మరికొందరు ఏమో మీకు మీ కొడుకే అర్థంకాక గెలిపించుకోలేక పోయారు ఇక మీకు జగన్ ఎప్పుడు అర్థం కావాలి అంటూ స్పందిస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు జగన్ పై మండిపడుతూ ట్విట్ చేశారు. 


ఉద్యోగ కల్పనా విషయంపై స్పందిస్తూ 'ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళను తీసేసి, కొత్తవాళ్ళను తెచ్చుకోవడం, వాటికే ఉద్యోగాల కల్పన అని పేరుపెట్టుకోవడం ఏం పిచ్చిపనో నాకర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఔట్ సోర్సింగ్ వాళ్ళను పర్మినెంట్ చేస్తామని హామీలు ఎందుకిచ్చినట్టు?' మీ మాటలు నమ్మి, మిమ్మల్ని గెలిపించి, ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే మహిళలని కూడా చూడకుండా ఇంత దారుణంగా, కర్కశంగా వ్యవహరిస్తారా? అడిగేవాళ్ళు లేరనుకుంటున్నారా? ఒక్క ఉద్యోగం ఊడగొట్టకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది తెలుగుదేశం.' అంటూ జగన్ పై ధ్వజం ఎత్తారు చంద్రబాబు నాయుడు. మరి ఈ ట్విట్ కు వైసీపీ ప్రభుత్వ నేతలు ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: